New Income Tax Benefits: కొత్త ఆదాయపు పన్ను స్లాబ్‌ ప్రయోజనం ఏమిటి..? ఇప్పుడు ఎంత డబ్బు ఆదా చేసుకోవచ్చు? పూర్తి వివరాలు

New Income Tax Slab Benefits:కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మసీలాతారామన్‌ వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆదాయపు విషయంలో..

New Income Tax Benefits: కొత్త ఆదాయపు పన్ను స్లాబ్‌ ప్రయోజనం ఏమిటి..? ఇప్పుడు ఎంత డబ్బు ఆదా చేసుకోవచ్చు? పూర్తి వివరాలు
Budget - 2023 Income Tax New Slab

Updated on: Feb 01, 2023 | 5:40 PM

New Income Tax Slab Benefits:కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మసీలాతారామన్‌ వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆదాయపు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజల కోరికలను నెరవేర్చారు. ఇప్పుడు సామాన్యులు రూ.7 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. నిర్మలా సీతారామన్ ఇప్పుడు రూ.5 లక్షల వరకు ఆదాయంపై లభించే పన్ను రాయితీ పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. అయితే ఇది కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకున్నవారికి మాత్రమే. ఇప్పుడు కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను కొత్త స్లాబ్ ఈ క్రింది విధంగా ఉంటుంది. అయితే రూ. 0-3 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. దీని బట్టి చూస్తే ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెరిగింది. ఏటా 7 లక్షల వరకు సంపాదిస్తున్న వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఆదాయపు పన్ను శ్లాబులను 6 నుంచి 5కి తగ్గించారు. మరి కొత్త స్లాబ్‌.. పాత స్లాబ్‌కు తేడా ఏమిటి? అప్పటి పన్ను విధానానికి, ఇప్పటి పన్ను విధానానికి ఎంత డబ్బు ఆదా అవుతుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కొత్త పన్ను స్లాబ్‌:

• రూ.0-3 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు.

• రూ. 3 నుండి రూ. 6 లక్షల వరకు 5 శాతం

• రూ. 6 నుండి రూ. 9 లక్షల వరకు 10 శాతం

• రూ. 9 నుంచి రూ. రూ.12 లక్షల వరకు 15 శాతం

• రూ. 12 నుండి రూ.15 లక్షల వరకు 20 శాతం

• రూ. 15 లక్షల పైన 30 శాతం పన్ను వర్తిస్తుంది.

పాత పన్ను స్లాబ్‌:

• పాత విధానంలో రూ.2.5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు

• రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయంపై 5 శాతం

• రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఆదాయంపై 20 శాతం

• రూ.10 లక్షలకు పైబడిన ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తారు.

  1. ఇంతకుముందు రూ.3 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు. ఇప్పుడు మీరు 5 లక్షల వరకు ఆదాయంపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
  2. ఇంతకుముందు మీరు 7 లక్షల వరకు ఆదాయంపై 32,800 పన్ను చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు 7 లక్షల వరకు ఆదాయంపై మీరు ప్రామాణికంగా 50 వేలు, 87A రివెట్‌గా రూ.20800 ఆదా అవుతుంది.
  3. గతంలో రూ.8 లక్షల వరకు ఆదాయంపై రూ.45,000 పన్ను చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు కేవలం రూ.35,000 పన్ను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో మీరు 10,000 రూపాయల ప్రయోజనం పొందవచ్చు.
  4. ఇంతకుముందు రూ.9 లక్షల వరకు ఆదాయంపై రూ.60,000 పన్ను చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు 9 లక్షల వరకు ఆదాయంపై రూ.45,000 పన్ను చెల్లించాలి. అంటే ఇందులో మీరు రూ.15000 వరకు ప్రయోజనం పొందవచ్చు.
  5. గతంలో 10 లక్షల వరకు ఆదాయంపై 78,000 పన్ను చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు కేవల రూ.62400 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో మీరు రూ.15,600 ప్రయోజనం పొందుతారు.
  6. ఇంతకుముందు రూ.11 లక్షల వరకు ఆదాయంపై 95000 పన్ను చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు రూ.74,400 పన్ను చెల్లించాలి. అంటే ఇందులో మీరు రూ.20,000 ప్రయోజనం పొందవచ్చు.
  7. ఇంతకుముందు రూ.12 లక్షల వరకు ఆదాయంపై రూ.115,000 పన్ను చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు 12 లక్షల వరకు ఆదాయంపై 90,000 పన్ను చెల్లించాలి. అంటే ఇందులో మీరు రూ.25,000 ప్రయోజనం పొందవచ్చు.
  8. ఇంతకుముందు రూ.13 లక్షల వరకు ఆదాయంపై రూ.1,37,500 పన్ను చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు రూ.1,10,000 పన్ను చెల్లించాలి. అంటే కొత్త ట్యాక్స్‌ ప్రకటన తర్వాత ఇందులో మీరు రూ.27,500 ప్రయోజనం పొందవచ్చు.
  9. ఇంతకు ముందు రూ.14 లక్షల వరకు ఆదాయంపై రూ.1,62,500 పన్ను చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు రూ.1,30,000 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు రూ.32500 ప్రయోజనం పొందవచ్చు.
  10. గతంలో రూ.15 లక్షల వరకు ఆదాయంపై రూ.195,000 పన్ను చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు రూ.156,000 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో మీరు రూ.39,000 ప్రయోజనం పొందవచ్చు.
  11. ఇంతకుముందు రూ.20 లక్షల వరకు ఆదాయంపై రూ.3,51,000 పన్ను చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు రూ.3,12,000 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో మీరు రూ.39,000 ప్రయోజనం పొందుతారు.
  12. ఇంతకుముందు 50 లక్షల వరకు ఆదాయంపై రూ.12,87000 పన్ను చెల్లించాల్సి ఉండగా, రూ.12,48000 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో మీరు రూ.39,000 ప్రయోజనం పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి