BSNL and Viasat Trial: జియో, ఎయిర్‌టెల్‌‌ను చావుదెబ్బ కొట్టిన బీఎస్ఎన్ఎల్..ఇక నుంచి మొబైల్ టవర్లు లేకుండానే ఫోన్ కాల్స్

| Edited By: Velpula Bharath Rao

Oct 18, 2024 | 3:48 PM

బీఎస్ఎన్ఎల్ చేసిన సరికొత్త ప్రయోగం సక్సెస్ అయింది. గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ వియాసత్‌తో కలిసి సరికొత్త సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్ టవర్లతో పనిలేకుండానే ఫోన్ కాల్స్ చేసుకునే కొత్త టెక్నాలజీని బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోమారు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది.

BSNL and Viasat Trial: జియో, ఎయిర్‌టెల్‌‌ను చావుదెబ్బ కొట్టిన బీఎస్ఎన్ఎల్..ఇక నుంచి మొబైల్ టవర్లు లేకుండానే ఫోన్ కాల్స్
Bsnl And Viasat Trial
Follow us on

రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోమారు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సాటిలైట్ కమ్యూనికేషన్ సేవలందిస్తున్న వియసత్‌తో కలిసి ఓ కొత్త టెక్నాలజీని బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకొస్తుంది. ‘డైరెక్ట్ టు డివైజ్’ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్ టవర్లతో పనిలేకుండానే ఫోన్ కాల్స్ వచ్చే విధంగా స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర స్మార్ట్ డివైజ్‌లు శాటిలైట్ కమ్యూనికేషన్‌పై బీఎస్ఎన్ఎల్ చేసిన ట్రయల్స్ విజయవంతమైంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లు ఇద్దరికీ ఇది అందుబాటులోకి రానుంది. అంతేకాదు, స్మార్ట్ వాచ్‌తోపాటు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర స్మార్ట్ డివైజ్‌లకు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర సేవలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతోనే ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది.

మొబైల్లో సిమ్ కార్డు లేకుండానే నిరంతరంగా కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్మార్ట్ వాచ్లు, ఇంటర్నెట్ ఉన్న కార్లు, టాబ్, లాప్టాప్ ఇలా అన్నింట్లోంచి సిమ్ కార్డ్ లేకుండానే కాల్స్ మాట్లాడుకోవచ్చు.పర్సనల్, డివైజ్ కమ్యూనికేషన్‌కు సపోర్ట్ చేసేలా దీనిని డిజైన్ చేశారు. ఎక్కడున్నామన్న దానితో సంబంధం లేకుండా నిరంతర కనెక్టివిటీని ఇది అందిస్తుంది. యూజర్లకు ఇది గొప్ప కవరేజీ ఇవ్వడంతోపాటు నమ్మకమైన కమ్యూనికేషన్ అందిస్తుంది. మరీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు గొప్ప ఉపయోగకరంగా ఉంటుంది. శాటిలైట్ కమ్యూనికేషన్‌లో భాగమైన డైరెక్ట్ టు డివైజ్ సేవల్లో ఇక మొబైల్ టవర్లతో పని ఉండదు. ఇంకా చెప్పాలంటే శాటిలైట్ ఫోన్లలా అన్నమాట. బీఎస్ఎన్ఎల్ కొద్ది రోజులుగా దీనిపైన ప్రయోగాత్మక కాల్స్ చేస్తుంది. దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి కొన్ని వందల కాల్స్ ట్రయల్ చేసింది. కొద్ది నెలల్లోనే ప్రజలకు మీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. అయితే దీనివల్ల కొన్ని దేశభద్రతకు సంబంధించి, సెక్యూరిటీ కారణాలు కూడా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనేది చూడాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి