Mobile Recharge Plan: ప్రస్తుత తరుణంలో వివిధ టెలికాం నెట్‌వర్క్ సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. కస్టమర్లను మరింతగా ఆకర్షించుకునేందుకు వివిధ మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలు రకరకాల ఆఫర్లు పెడుతూ దూసుకుపోతున్నాయి. ఇక ప్రభుత్వరంగ టెలికాం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అతి తక్కువ ధరలకే ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. కేవలం రూ.397కే ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంత తక్కువ ధరలో మరే ఇతర టెలికాం సంస్థ ఏడాది పాటు వ్యాలిడిటీ ఇవ్వడం లేదు. అయితే ఇందులో అసలు విషయం ఇంకొకటి ఉంది. ఈ ప్లాన్ కింద లభించే కాలింగ్, డేటా ప్రయోజనాలు ఏడాది పాటు లభించవు. ఈ బెనిఫిట్స్ కేవలం 60 రోజుల వరకు మాత్రమే వర్తిస్తాయి. మీ సిమ్ యాక్టివ్‌లో ఉంచుకోవడానికి నెలనెల రీఛార్జ్ చేసే బాధ తప్పుతుందన్నట్లు. 60 రోజుల తర్వాత మీ ఇష్టం ఉంటే రీఛార్జ్ చేసుకోవచ్చు.. లేదంటే లేదు. గతంలో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.365కే అందుబాటులో ఉండేది. దీనిని తాజాగా రూ.397కు సవరించింది బీఎస్‌ఎన్‌ఎల్.
అయితే ప్లాన్ కింద వినియోగదారులకు ప్రతి రోజు 2జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అయితే ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులైనప్పటికీ ప్లాన్ ప్రయోజనాలు మాత్రం 60 రోజులకే అందుబాటులో ఉంటాయి. మొదటి రీఛార్జ్ చేసుకునే కస్టమర్లకు ఉచిత పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 2జీబీ రోజువారీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. ఆ తర్వాత డేటా స్పీడ్ 80 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. అయితే ఇతర టెలికాం సంస్థలు ఏడాది వ్యాలిడిటీతో అందిస్తున్న ప్రయోజనాలు ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్-ఐడియా కూడా 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అయితే ఈ ప్లాన్‌ల ప్రయోజనాలు ఏడాది పాటు లభిస్తాయి. అంటే వీటితో 2జీబీ రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, 100 ఎస్‌ఎంఎస్‌లు ఏడాది పాటు అందిస్తాయి. అదనంగా స్ట్రీమింగ్ డివైజ్‌లకు ఉచిత మెంబర్‌షిప్ కూడా అందిస్తున్నాయి.
జియో రూ.2,399 ప్లాన్‌తో ఏడాది పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ తోపాటు 2జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనాలను అందిస్తుంది. అదనంగా జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ఇస్తుంది.
ఎయిర్‌టెల్ రూ.2,498 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ కింద రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.
వొడాఫోన్-ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఏడాది పాటు 2జీబీ రోజువారీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలు లభిస్తాయి. వీటితో పాటు వారాంతపు డేటా రోల్‌ఓవర్ డేటా వంటివి పొందవచ్చు. ఈ ప్లాన్‌తో ప్రీమియం జీ5 సబ్స్క్రిప్షన్, వి మూవీస్ టీవీ వంటి వాటికి యాక్సెస్ లభిస్తుంది.
అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌లో రూ.1,999 కు వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తుంది. ఈ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ కింద రూ.3జీబీ రోజువారీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ రూ.365 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 60 రోజుల పాటు బీఎస్‌ఎన్‌ఎల్ టీవీ కంటెంట్‌తో పాటు ఏడాది పాటు ఎరోస్‌నౌ ఓటీటీ ప్రయోజనాలను ఇస్తుంది. ప్రతి రోజు 3జీబీ డేటా అయిపోయిన తర్వాత డేటా స్పీడ్ 80 కేబీపీఎస్‌కు తగ్గుతుంది.