BSNL Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. రోజుకు రూ.5తో అన్నీ ఫ్రీ..

త్వరలో క్రిస్మస్, న్యూఇయర్ లాంటి వరుస పండుగలు వస్తున్న క్రమంలో టెలికాం కంపెనీలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. రీఛార్జ్ ఆఫర్లు, డిస్కౌంట్లను మొబైల్ వినియోగదారుల కోసం తీసుకొస్తున్నాయి. ప్రైవేట్ కంపెనీలకు పోటీగా ప్రభుత్వ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ కూడా ప్రత్యేక ఆఫర్లను తీసుకొస్తుంది.

BSNL Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. రోజుకు రూ.5తో అన్నీ ఫ్రీ..
Bsnl Recharge Plans

Updated on: Dec 20, 2025 | 5:30 PM

కొత్త ఏడాది వచ్చేస్తోంది. చాలా వస్తువుల ధరలు మారనున్నాయ్. కొన్ని వస్తువుల ధరలు పెరగనుండటంతో ప్రజలపై అదనపు భారం పడనుంది. రూపాయి పతనంతో మొబైల్ ధరలు వచ్చే ఏడాది పెరగనుండగా.. రీచార్జ్ ధరలను కూడా భారీగా పెంచేందుకు టెలికాం కంపెనీలు రెడీ అవుతున్నాయి. దీంతో మొబైల్ మెయింటెనెన్స్ మరింత పెరగనుంది. ప్రైవేట్ కంపెనీలు రీఛార్జ్ ధరల పెంపుకు రంగం సిద్దం చేసుకుంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్స్‌ను తెస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టిన మరో చవకైన ఓ ప్లాన్ గురించి తెలుసుకుందాం.

రోజుకు రూ.5తో చౌకైన ప్లాన్

బీఎస్ఎన్ఎల్ కొత్తగా రూ.347 ప్లాన్ తీసుకొచ్చింది. 50 రోజుల వ్యాలిడిటీతో కూడిన ఈ ప్లాన్‌లో ఆన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఇక రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటాతో పాటు 100 ఎస్‌ఎంఎస్‌లు పంపుకునే సౌకర్యం ఉంది. అంటే రోజుకు రూ.5 కంటే తక్కువ ధరతో మీకు ఈ ప్లాన్ లభిస్తుంది. ప్రైవేట్ కంపెనీల రీఛార్జ్ ధరలు పెరుగుతున్న క్రమంలో వినియోగదారుల ఖర్చులు తగ్గించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్లాన్ తీసుకొచ్చింది. ప్రైవేట్ టెలికాం కంపెనీలలో 50 రోజుల ప్లాన్ అంటే రూ.500 వరకు రీఛార్జ్ ఉంటుంది. కానీ అదే బీఎస్‌ఎన్‌ఎల్ రూ.150 తక్కువ ధరలో అందిస్తుంది. ఇక త్వరలో క్రిస్మస్ వస్తున్న క్రమంలో మరో ప్రత్యేక ప్లాన్ విడుదలకు బీఎస్ఎన్‌ఎల్ రెడీ అవుతోంది.

త్వరలో బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ

కొత్త ఏడాదిలో దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్ఎల్ 5జీ సర్వీసులను ప్రారంభించనుంది. ఇటీవలే లక్ష స్వదేశీ 4జీ మొబైల్ టవర్లను ఏర్పాటు చేసి ఓ మైలురాయి సాధించింది. వీటినే 5జీకే మార్చనున్నారు. వచ్చే ఏడాది ప్రారభంలోనే ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన కేంద్రాల్లో 5జీ సర్వీసులను ప్రారంభించనుంది.