BSNL Offers: ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇస్తున్నాయి. దాంతో సదరు ఉద్యోగులకు డేటా చాలా అవసరం అవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పలు టెలీకం కంపెనీలు.. వినియోగదారులను తమవైపు ఆకర్షించుకునేందుకు కొత్త కొత్త ప్లాన్స్‌ను తీసుకువస్తున్నాయి. జియో, విఐ, ఎయిర్‌టెల్ సంస్థలు అనునిత్యం ఏదో ఒక కొత్త ప్లాన్‌కు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వాటికి పోటీగా వస్తోంది బిఎస్ఎన్ఎల్. కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అతి తక్కువ ధరకే డేటా, కాలింగ్ సదుపాయం కల్పిస్తోంది. మూడు నెలల వ్యాలిడిటీతో డేటా, కాలింగ్ సదుపాయం కావాలంటే ఏ నెట్‌వర్క్‌లో అయినా మినిమం రూ. 299, 349, ఇలా రకరకాల ప్లాన్స్ ఉన్నాయి. కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం ఈ అవకాశాన్ని కేవలం రూ. 100 లోపే అందిస్తోంది. రూ. 94, రూ. 95 ప్లాన్స్‌ను తీసుకువచ్చింది.
బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు రూ. 94 తో రీచార్జ్ చేసుకుంటే.. 90 రోజులు వ్యాలిడిటీతో 3 జీబీ డేటా, 100 కాలింగ్ నిమిషాలు ఉచితంగా పొందవచ్చు. నిర్ణీత గడువులోగా 100 ఉచిత నిమిషాలు అయిపోయినట్లయితే.. లోకల్ కాల్స్‌కు నిమిషానికి రూ. 1 చొప్పున కాస్ట్ పడుతుంది. ఇక ఎస్ఎంఎస్ విషయం చూసుకున్నట్లయితే.. లోకల్ ఎస్ఎంఎస్‌కి 80 పైసలు కాస్ట్ చేస్తుండగా.. నేషనల్ ఎస్ఎంఎస్‌కు రూ. 1.2 చార్జ్ చేస్తారు. అయితే, ఈ ప్లాన్ కొత్త కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని బిఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది. అలాగే రూ. 95 రీచార్జ్ చేసుకున్నట్లయితే.. 90 రోజుల వ్యాలిడిటీతో 3 జీబీ డేటా, 100 ఉచిత నిమిషాలు లభిస్తాయి. ఫ్రీ మినిట్స్ అయిపోయాక లోకల్ కాల్స్‌కు నిమిషానికి 20 పైసలు, నేషనల్ కాల్స్‌కు నిమిషానికి 24 పైసలు చొప్పున ఛార్జ్ చేస్తారు. ఇక లోకల్ ఎస్ఎంఎస్‌కి 80 పైసలు, నేషనల్ ఎస్ఎంఎస్‌కి రూ. 1.2 ఛార్జ్ చేయనున్నారు.
Also read:
Sushil Kumar: రెజ్లర్ సుశీల్ కుమార్ పై లుకౌట్ నోటీసులు జారీ.. తప్పించుకు తిరుగుతున్నందుకే!
NTR Chandra Babu: ఎన్టీఆర్ కరోనా బారిన పడడంపై స్పందించిన చంద్రబాబు.. ట్విట్టర్ వేదికగా..