Gas Cylinder: మీకు గ్యాస్‌ సిలిండర్‌ ఉందా..? ఇంకా 5 రోజులే సమయం

Gas Cylinder: దేశవ్యాప్తంగా సుమారు 329.7 మిలియన్ల క్రియాశీల గృహ ఎల్‌పిజి వినియోగదారులు ఉన్నారు. ముఖ్యంగా ఆగస్టు 31 తర్వాత కూడా గ్యాస్ సిలిండర్ల సరఫరా కొనసాగుతుందని ఆ అధికారి హామీ ఇచ్చారు. అయితే తమ ఇ-కెవైసిని పూర్తి చేయని వారికి సిలిండర్లు..

Gas Cylinder: మీకు గ్యాస్‌ సిలిండర్‌ ఉందా..? ఇంకా 5 రోజులే సమయం
Lpg Gas

Updated on: Aug 26, 2026 | 12:03 PM

Gas Cylinder KYC: ప్రస్తుతానికి ఇండేన్, హెచ్‌పి, భారత్ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త లేదు. ఇ-కేవైసీని పూర్తి చేయడానికి చివరి తేదీని ఇటీవల ఒక వారం పాటు పొడిగించారు. ఇప్పుడు దానిని 2026 ఆగస్టు 31 వరకు పొడిగించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఆగస్టు 23వ తేదీలోగా తమ ఇ-కేవైసీని పూర్తి చేసుకోని వినియోగదారులు ఈ రోజు అంటే ఆగస్టు 24వ తేదీ నుండి సిలిండర్లను బుక్ చేసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉండేది.

అయితే ప్రస్తుతం వంటగ్యాస్ వినియోగదారులకు పెద్ద ఊరటనిచ్చాయి గ్యాస్‌ కంపెనీలు. ఇప్పుడు ఎల్పీజీ ఇ-కేవైసీ పూర్తి చేయడానికి చివరి తేదీని ఆగస్టు 31 వరకు పొడిగించారు. ఇటీవలి వారాల్లో, మూడు ప్రభుత్వ చమురు కంపెనీలైన ఇండియన్ ఆయిల్, హెచ్‌పిసిఎల్, బిపిసిఎల్, గృహ వినియోగ ఎల్పీజీ రేటుకే గ్యాస్ సిలిండర్ కావాలంటే వీలైనంత త్వరగా తమ ఇ-కేవైసీని పూర్తి చేసుకోవాలని వినియోగదారులకు తెలియజేశాయి.

ఇది కూడా చదవండి: Ratan TATA: రతన్ టాటా ప్రేమకథ, పెళ్లి ఎందుకు చేసుకోలేకపోయారు? పూర్తి వివరాలు

ఇవి కూడా చదవండి

ది హిందూ వార్తా కథనం ప్రకారం, పేరు వెల్లడించని చమురు పరిశ్రమ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఎల్‌పిజి ఇ-కెవైసికి ఇప్పుడు కొత్త గడువు ఆగస్టు 31 అని, ఇంకా ఈ ప్రక్రియను పూర్తి చేయని వారికి కూడా దీనికి సంబంధించి సందేశం అందుతుందని చెప్పారు..

గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా సుమారు 329.7 మిలియన్ల క్రియాశీల గృహ ఎల్‌పిజి వినియోగదారులు ఉన్నారు. ముఖ్యంగా ఆగస్టు 31 తర్వాత కూడా గ్యాస్ సిలిండర్ల సరఫరా కొనసాగుతుందని ఆ అధికారి హామీ ఇచ్చారు. అయితే తమ ఇ-కెవైసిని పూర్తి చేయని వారికి సిలిండర్లు ఏ ధరకు అందుబాటులో ఉంటాయనేది పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుండి వచ్చే భవిష్యత్ సూచనలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం విడుదల కాలేదు.

ఇది కూడా చదవండి: House Construction: 150 గజాల ఇంటి నిర్మాణానికి 12 పిల్లర్ల ఖర్చు ఎంతో తెలుసా..?

ఇదిలా ఉండగా, గడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు చమురు కంపెనీ అధికారులు తనకు మౌఖికంగా తెలియజేశారని తెలంగాణ ఎల్పీజీ పంపిణీదారుల సంఘం అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.

గడువు ముగిసిన తర్వాత కూడా ఇ-కేవైసీ కొనసాగుతుంది:

గడువు ముగిసినంత మాత్రాన ఇ-కేవైసిని నిలిపివేస్తున్నట్లు కాదని ఎల్‌పిజి డీలర్లు స్పష్టం చేశారు. ఇంకా తమ ఇ-కేవైసిని పూర్తి చేయని వినియోగదారులు భవిష్యత్తులో దానిని పూర్తి చేయగలరు. ఇ-కేవైసిని ఎప్పటికీ పూర్తిగా నిలిపివేయబోమని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని అన్నారు.

ఇది కూడా చదవండి: Gas Cylinder: సంచలన నిర్ణయం.. మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us