IRCTC Account: రైళ్లలో ప్రయాణించే వారికి అనేక సదుపాయాలు అందుబాటులోకి వస్తుంటాయి. ప్రయాణికుల కోసం రైల్వే శాఖ (Railway Department) కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. టికెట్ల విషయంలో ఎక్కువగా ఉపయోగించేది ఐఆర్‌సీటీసీ. ప్రతి రోజు లక్షలాది టికెట్లు ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ అవుతుంటాయి. అయితే ఇంట్లోనే కూర్చుని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా రైలు టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. ఇక ఐఆర్‌సీటీసీ (IRCTC Account) అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయాల్సి ఉంటుంది. ఇలా లింక్ చేస్తే నెలలో ఎక్కువ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఒక నెలలోపు ఆరు టిక్కెట్‌లను మాత్రమే బుక్ చేసుకోవచ్చు. కానీ ఆధార్ లింక్ చేసినట్లయితే నెలలో గరిష్టంగా 12 టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆధార్ ధృవీకరణతో పాటు, ప్రయాణికుల ఆధార్ ధృవీకరణ కూడా అవసరం. ఆ తర్వాత మాత్రమే 12 టికెట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. IRCTC ఖాతాను ఆధార్‌తో ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి.
మీరు ముందుగా IRCTC అధికారిక వెబ్‌సైట్ కి వెళ్లండి. మీ ID, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. తర్వాత My Profile ఆప్షన్‌లోకి వెళ్లి ఆధార్ KYCపై క్లిక్ చేయండి. ఆధార్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. OTP ధృవీకరణ తర్వాత ఆధార్ ధృవీకరణ పూర్తవుతుంది.
ఏసీ కోచ్ కోసం రైల్వే తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో, స్లిపర్.. అంటే నాన్ ఏసీ కోచ్ కోసం బుకింగ్ ఉదయం 11 గంటల నుండి ప్రారంభమవుతుంది. తత్కాల్ టికెట్ సేవ ప్రయాణానికి ఒక రోజు ముందు ప్రారంభమవుతుంది.
ప్రీమియం తత్కాల్ అంటే ఏమిటి?
ఇందులో ప్రీమియం తత్కాల్ టికెట్ విధానం కూడా ఉంటుంది. ఎమర్జెన్సీ కోసం తత్కాల్‌తో పాటు, ప్రీమియం తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రీమియం తత్కాల్ కూడా సాధారణ తత్కాల్ టిక్కెట్ స్కీమ్ మాదిరిగానే ఉంటుంది. విమానంలో డిమాండ్ ఆధారంగా ఛార్జీల విధానం ఉన్నట్లే ప్రీమియం తత్కాల్ కూడా ఉంటుంది.
ఇవి కూడా చదవండి: