BMW Electric Scooter: ద్విచక్ర వాహన ప్రియులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. బీఎండబ్ల్యూ (BMW) భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లోకి ప్రవేశించింది. వారి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ BMW CE 04 పూర్తిగా బిల్ట్-అప్ యూనిట్‌గా భారతదేశానికి వస్తోంది. మరో మాటలో చెప్పాలంటే ఈ స్కూటర్ భారతదేశంలో తయారు కాలేదు. అసెంబుల్ కూడా కాలేదు. అయితే డిజైన్, అత్యాధునిక సాంకేతికత, పనితీరు పరంగా భారతదేశంలో మరే ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ దీనికి సరిపోలని పరిగణిస్తున్నారు. బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, విక్రమ్ పవా ప్రకారం.. ఈ స్కూటర్ భారతదేశంలో ఎలక్ట్రో-మొబిలిటీ కొత్త శకానికి నాంది పలుకుతుంది.
ఇది కూడా చదవండి: JioFiber: యూజర్లకు గుడ్‌న్యూస్.. భారీ డిస్కౌంట్‌తో జియో ఫైబర్
బీఎండబ్ల్యూ ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రధానంగా నగర రోడ్ల కోసం తయారు చేశారని ఆయన చెప్పారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి ఎలాంటి శబ్దం రాదు. కానీ వేగంగా వెళ్తుంది. ఈ స్కూటర్ పట్టణ రహదారుల గుండా సాఫీగా పరుగెడుతుంది. ఈ స్కూటర్ డిజైన్ పూర్తిగా కొత్తది. ఈ స్కూటర్‌ను రోడ్డుపైకి తీసుకెళ్తుంటే, ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా చూడాల్సిందే అనే కోరిక పుడుతుంది. ఇందులో సైడ్-లోడింగ్ హెల్మెట్ కంపార్ట్‌మెంట్, ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి.
ఈ ఆకర్షణీయమైన స్కూటర్ లిక్విడ్-కూల్డ్ పర్మనెంట్ మాగ్నెట్ ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ మోటారు 42 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా CE 04 స్కూటర్ కేవలం 2.6 సెకన్లలో 0 నుండి 50 km/h వేగాన్ని అందుకునే సామర్థ్యంతో తయారు చేశారు. ఇది గరిష్ట వేగం గంటకు 120 కి.మీ. ఇందులో లిథియం-అయాన్ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఈ స్కూటర్ 130 కిలోమీటర్లు నడుస్తుంది. అంతేకాకుండా స్కూటర్ తయారీలో వివిధ అధునాతన సాంకేతికతలను ఉపయోగించింది కంపెనీ. ఇందులో 10.25-అంగుళాల కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉంది. స్ప్లిట్ స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. స్కూటర్ స్టార్ట్ చేయడానికి కీ అవసరం లేదు. అంతేకాకుండా, రివర్సింగ్ ఎయిడ్, ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్కూటర్‌ను మూడు రైడింగ్ మోడ్‌లలో (ఎకో, రెయిన్, రోడ్) ఆపరేట్ చేయవచ్చు. నగరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్‌ను రూపొందించారు.
ఇప్పుడు ధర గురించి మాట్లాడితే.. ఈ స్కూటర్ చాలా ఖరీదైనది. BMW CE 04 ఎక్స్-షోరూమ్ ధర రూ.14,90,000. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి భారతదేశంలోని అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో ఈ స్కూటర్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: New Rules August 1: అలర్ట్.. ఆగస్టు 1 నుంచి మారనున్న నిబంధనలు.. అవేంటో తెలుసా?
మనిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి