Bitcoin all time record : క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ మంగళవారం సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. తాజా ట్రేడింగ్‌లో బిట్ కాయిన్ విలువ 50 వేల డాలర్లను దాటింది. బిట్‌కాయిన్‌కు ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సర్వీస్ జెయింట్ సంస్థలు, అంతర్జాతీయ బ్యాంకులు బాసటగా నిలువడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపడింది. దీంతో ఈ ఏడాది 45 రోజుల్లోనే బిట్ కాయిన్ విలువ దాదాపు 75 శాతం పెరిగింది. తద్వారా ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రజాదరణ పొందిన వర్చువల్ కరెన్సీగా బిట్ కాయిన్ నిలిచింది.
మంగళవారం మధ్యాహ్నం 12.35 గంటలకు ట్రేడింగ్‌లో బిట్ కాయిన్ విలువ ఆల్‌టైమ్ రికార్డులను దాటి 50,547.70 డాలర్లుగా నమోదు అయ్యింది. సోమవారం ట్రేడింగ్‌తో పోలిస్తే 4.4 శాతం పెరిగింది. ఆ తర్వాత 12.55 గంటలకే కాసింత తగ్గి 49,505.35 డాలర్ల వద్ద సెటిలైంది. అంతేకాకుండా సాంప్రదాయ కరెన్సీ కంటే బిట్‌కాయిన్‌లో కొంత నగదును కలిగి ఉన్నట్లు స్టాక్ మార్కెట్లో అత్యంత విలువైన కార్ల సంస్థ టెస్లా గతవారం తెలిపింది.త్వరలో డిజిటల్ కరెన్సీని దాని కార్ల చెల్లింపుగా అంగీకరించవచ్చు. దీంతో డిసెంబరులో మొదటిసారి బిట్‌కాయిన్ $ 20,000 దాటింది. ఇది మూడు నెలల్లో దాని విలువ రెట్టింపు అయ్యింది. ఆవట్రేడ్ అనలిస్ట్ నయీమ్ అస్లాం మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీ కింగ్ బిట్ కాయిన్ 50 వేల డాలర్ల మైలురాయిని దాటడం ఇదే మొదటిసారి అన్నారు. బంగారం తక్కువ సరఫరా ఉండటంతో బిట్ కాయిన్ విలువ దూసుకెళ్తోందని ఆయ తెలిపారు.
తొలుత ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ జేపీ మోర్గాన్స్.. బిట్ కాయిన్.. బంగారానికి నూతన అవతారంగా నిలుస్తుందని పేర్కొంది. ఆన్‌లైన్ పేమెంట్స్ సంస్థ పే పాల్.. తమ ఖాతాదారులకు పరిచయం చేస్తామని ప్రకటించింది. అలాగే ఇతర ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థలు వీసా, మాస్టర్ కార్డ్ సంస్థలు తమ వినియోగదారులకు బిట్‌కాయిన్‌తో సేవలందించడానికి సిద్ధం అని తెలిపాయి. మరోవైపు గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలన్ మస్క్ భారీగా బిట్ కాయిన్‌లో 1.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టారు. త్వరలో డిజిటల్ కరెన్సీని దాని కార్ల చెల్లింపుగా అంగీకరించవచ్చు.
బ్లాక్‌రాక్‌లోని ఒక ఉన్నతాధికారి గత సంవత్సరం బిట్‌కాయిన్ ఎదోక రోజుకు బంగారాన్ని భర్తీ చేయగలదని చెప్పారు. బిట్‌కాయిన్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు జే జెడ్, ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే ఇదివరకే ప్రకటించారు.
Read Also… IPL Auction 2021: మాక్స్‌వెల్ ఆర్‌సీబీకి.. చెన్నైకి స్మిత్.? వేలంలో అమ్ముడుపోయే ప్లేయర్స్ వీరేనా.!!