2018 తర్వాత మొట్టమొదటి సారిగా ఆదివారం బిట్ కాయిన్ $11,247 మార్కును చేరుకుంది. దాదాపు 15 నెలల తర్వాత ఈ మార్కుకు చేరింది. జనరల్‌గా డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.69 ఉంది. నిజానికి ఈ ఏడాది మొదట్లో బిట్ కాయిన్ విలువ రూ.2లక్షల 78 వేలే. ఇదే డిజిటల్ కరెన్సీ.. 2017లో రూ. 13 లక్షలకు పైగా ఉండేది. ఇక పై ఫేస్‌బుక్… లిబ్రా అనే డిజిటల్ కరెన్సీని తేబోతున్నట్లు ప్రకటించింది. ఫేస్‌బుక్ తన అంతర్గత కార్యకలాపాలను లిబ్రా కరెన్సీ ద్వారా చేపట్టనుంది.
వర్చువల్ కరెన్సీగా పిలుస్తున్న బిట్ కాయిన్‌పై ప్రజల్లో నమ్మకం పెరుగుతుండటానికి కారణం ఫేస్ బుక్ తెస్తున్న లిబ్రా కరెన్సీయే. దానిపై నమ్మకం కలిగివున్న ప్రజలు… బిట్ కాయిన్ కూడా మంచిదేనని నమ్ముతున్నారు. 2008లో బిట్ కాయిన్ మొదలైంది. 2011లో దాని విలువ ఒక డాలర్‌కి చేరింది. ఇక 2017 నాటికి విలువ ఏకంగా 19వేల డాలర్లకు చేరింది. అమెరికా, చైనా మధ్య ఆంక్షలు, వాణిజ్య యుద్ధం, ఇరాన్‌తో అమెరికా యుద్ధ సన్నాహాల వంటివి రెగ్యులర్ డాలర్, యూరోలపై ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకాన్ని తగ్గించాయి. సంప్రదాయ కరెన్సీ కంటే, డిజిటల్ కరెన్సీ బెటరని వారు భావిస్తుండటంతో రేటు పెరుగుతోంది.