మీరు బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా? మీ బడ్జెట్ తక్కువగా ఉందా? మరేం పర్వాలేదు. తక్కువ బడ్జెట్‌లోనే ఎక్కువ మైలేజీ ఇచ్చే.. సూపర్ బైక్స్‌కు సంబంధించిన సమాచారం ఇవాళ మీకోసం తీసుకువచ్చాం. ఇది మాత్రమే కాదు.. ఈ బైక్ కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం కూడా లేదు. కొనుగోలు చేసిన వెంటనే బైక్ మీ వద్దకు చేరుకుంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో.. టాప్ బ్రాండ్ బైక్‌లపై అద్భుతమైన ఆఫర్స్ లభిస్తోంది. భారీ తగ్గింపుతో మీరు ఈ బైక్స్‌ను కొనుగోలు చేయొచ్చు. అంతేకాదు.. బైక్ కొనుగోలుపై వివిధ బ్యాంకుల ద్వారా డిస్కౌంట్ కూడా లభిస్తోంది. మరి ఆ బైక్స్ ఏంటి? ఆ ఆఫర్స్ ఏంటి? ఆ వివరాలు ఓసారి చూసేయండి.
బ్లాక్ అండ్ రెడ్ కలయిక బైక్‌లో.. 97.22 cc ఇంజిన్‌తో హీరో హెచ్‌ఎఫ్ బైక్ అందుబాటులో ఉంది. ఈ బైక్ 65 kmpl మైలేజీని ఇస్తుందని కంపెనీ క్లేయిమ్ చేస్తోంది. ఈ హీరో బైక్‌ని కేవలం రూ.59,893కే కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయడం ద్వారా బ్యాంక్ ఆఫర్‌ల ప్రయోజనాన్ని కూడా పొందువచ్చు.
ఈ బైక్‌పై ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే ఆఫర్ ఇస్తోంది. మీరు బజాజ్ ప్లాటినా 100ని ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో రూ. 69,638కి కొనుగోలు చేయొచ్చు. ఈ బైక్ గరిష్టంగా గంటకు 90 కి.మీ వేగంతో వెళ్తుంది. ఇవాళ మీరు ఈ బైక్‌ను ఆర్డర్ చేస్తే, 6-7 రోజుల్లో మీ ఇంటికి డెలివరీ చేయబడుతుంది. మైలేజీ కూడా 70 kmpl మైలేజీని అందిస్తుంది.
బజాజ్ నుంచి వస్తున్న మరో బైక్ ఇది. ఇది కస్టమర్లకు అన్ని విధాలుగా కంఫర్ట్‌గా ఉంటుంది. ఈ బైక్ మీ రోజువారీ అప్-డౌన్ కోసం పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ బైక్‌ని ఫ్లిప్‌కార్ట్‌లో రూ.70,006 లకు సొంతం చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బైక్ ధరను చెల్లించలేకపోతే, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. అంటే, బైక్ డెలివరీ అయ్యాక కూడా మీరు అమౌంట్‌ను పే చేయొచ్చు. ఇక దీని మైలేజీ 60 నుంచి 70 వరకు ఉంటుందని కంపెనీ చెబుతోంది.
ఫ్లిప్‌కార్ట్‌లో హీరో ఈ సెల్ఫ్-స్టార్ట్ బైక్‌ను కేవలం రూ. 64,121కి మంచి ఆఫర్‌తో సొంతం చేసుకోవచ్చు. నివేదికల ప్రకారం, ఈ బైక్ 70 kmpl మైలేజీని ఇస్తుంది. బ్యాంక్ ఆఫర్స్ కూడా దీనికి ఉన్నాయి.
ఫ్లిక్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసే ఈ బైక్స్ అన్నీ కూడా 6 నుంచి 7 రోజుల్లో కస్టమర్లకు డెలివరీ అవుతాయి. అయితే, డెలివరీ కూడా మీరు పెట్టే లొకేషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఇక ఈ ధరలన్నీ ఎప్పడూ ఒకేలా ఉండకపోవచ్చు. సమయానుకూలంగా మారే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..