Soap: సామాన్యులకు షాక్.. పెరిగిన సబ్బులు, సర్ఫ్‎ల ధరలు..

|

Nov 25, 2021 | 8:22 PM

పెట్రోల్, డీజిల్, గ్యాస్, కూరగాయలు ఇలా ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. మొన్న బిస్కెట్ల ధర పెరిగింది. ఇప్పుడు సబ్బు, సర్ఫ్ ధరలు కూడా పెరిగాయి...

Soap: సామాన్యులకు షాక్.. పెరిగిన సబ్బులు, సర్ఫ్‎ల ధరలు..
Hul, Itc
Follow us on

పెట్రోల్, డీజిల్, గ్యాస్, కూరగాయలు ఇలా ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. మొన్న బిస్కెట్ల ధర పెరిగింది. ఇప్పుడు సబ్బు, సర్ఫ్ ధరలు కూడా పెరిగాయి. సబ్బులు, డిటర్జెంట్ల ధరలను పెంచుతున్నట్లు HUL, ITC ప్రకటించాయి. వీల్ డిటర్జెంట్ పౌడర్, రిన్స్ బార్, లక్స్ సబ్బు ధరలను 3.4 శాతం నుంచి 21.7 శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది. అదే సమయంలో, ఐటీసీ ఫియామా సబ్బు ధరను 10 శాతం, వివెల్ 9 శాతం, ఎంగేజ్ డియోడరెంట్ ధరలను 7.6 శాతం పెంచిందని CNBC TV18 నివేదిక ద్వారా తెలిసింది.

దేశంలోని రెండు అతిపెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) కంపెనీలు ధరల పెరుగుదల వెనుక ఇన్‌పుట్ ఖర్చు పెరగడమే కారణమని పేర్కొన్నాయి. HUL 1 కిలోల వీల్ డిటర్జెంట్ ప్యాక్ ధరను 3.4 శాతం పెంచింది. దీంతో దీని ధర రూ.2 పెరగనుంది. 500 గ్రాముల వీల్ పౌడర్ ప్యాక్ ధరలను కంపెనీ రెండు రూపాయలు పెంచింది. దీని ధర ఇప్పుడు రూ.28 నుంచి రూ.30కి పెరిగింది. 250 గ్రాముల రిన్ బార్ ప్యాక్ ధరను హెచ్‌యూఎల్ 5.8 శాతం పెంచినట్లు నివేదికలో పేర్కొంది. FMCG దిగ్గజం 100 గ్రాముల మల్టీప్యాక్ లక్స్ సబ్బు ధరను 21.7 శాతం లేదా రూ. 25 పెంచింది.

మరోవైపు 100 గ్రాముల ఫియామా సబ్బు ప్యాక్‌ల ధరలను ఐటీసీ 10 శాతం పెంచింది. అదే సమయంలో కంపెనీ 100 గ్రాముల వివెల్ సబ్బు ప్యాక్ ధరను తొమ్మిది శాతం పెంచింది. కంపెనీ 150 ఎంఎల్ బాటిల్ ఎంగేజ్ డియోడరెంట్ ధరను 7.6 శాతం, 120 ఎంఎల్ బాటిల్ ఎంగేజ్ పెర్ఫ్యూమ్ ధరను 7.1 శాతం పెంచినట్లు నివేదిక పేర్కొంది. ఇన్‌పుట్ కాస్ట్ ధరల్లో గణనీయమైన పెరుగుదల ఉందని, పరిశ్రమ ధరలను పెంచిందని ITC ప్రతినిధి CNBC TV18కి తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన వస్తువుల ధరలను కంపెనీ పెంచినట్లు ఆయన తెలిపారు. మొత్తం ధరల ఒత్తిడిని వినియోగదారులకు అందించకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రతినిధి తెలిపారు.

Read Also.. ITC: కోవిడ్ నివారణకు ఐటీసీ నాజల్ స్ప్రే.. క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం..