iPhone: మీరు ఐఫోన్‌ కొనాలనుకుంటున్నారా? ఇప్పు కొనేయండి.. భారీగా పెరగనున్న ధరలు..!

iPhone Price Hike: గ్లోబల్ మార్కెట్ ప్రకారం.. అమెరికా మార్కెట్‌లో రాబోయే ప్రో మోడల్స్ ధర సుమారు $100 వరకు పెరిగే అవకాశం ఉంది . మన దేశంలో ఐఫోన్ల ధరలు రకాన్ని బట్టి పెరిగే అవకాశం ఉందనే వార్తలు ఐఫోన్ ప్రేమికులను కొంత నిరాశకు గురిచేస్తున్నాయి..

iPhone: మీరు ఐఫోన్‌ కొనాలనుకుంటున్నారా? ఇప్పు కొనేయండి.. భారీగా పెరగనున్న ధరలు..!
Iphone

Updated on: Aug 26, 2026 | 12:37 PM

iPhone: ప్రముఖ దిగ్గజ టెక్ సంస్థ ఆపిల్ తమ ఐఫోన్ల ధరలను పెంచేందుకు సమాయత్తమవుతోందని ఒక నివేదిక వెల్లడించింది. రాబోయే రోజుల్లో ఐఫోన్ల ధరల పెంపు ఖాయమని తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ కథనం ఆధారంగా వచ్చిన సమాచారం ప్రకారం.. విడిభాగాల వ్యయం పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించే మెమరీ చిప్‌లు, ఇతర కీలక విడిభాగాల ధరలు భారీగా పెరగడంతో తయారీ వ్యయం అధికమైంది. ఇతర కంపెనీలైన శామ్‌సంగ్ (Samsung), గూగుల్ (Google) కూడా ఇప్పటికే తమ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల ధరలను సుమారు $100 (దాదాపు రూ.8,300) వరకు పెంచాయి. ఇప్పుడు ఆపిల్ కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

భారతదేశంలో ఎంత పెరిగే అవకాశం ఉంది?

గ్లోబల్ మార్కెట్ ప్రకారం.. అమెరికా మార్కెట్‌లో రాబోయే ప్రో మోడల్స్ ధర సుమారు $100 వరకు పెరిగే అవకాశం ఉంది (దాదాపు 9% పెంపు). మన దేశంలో ఐఫోన్ల ధరలు రకాన్ని బట్టి రూ.10,000 వరకు పెరిగే అవకాశం ఉందనే వార్తలు ఐఫోన్ ప్రేమికులను కొంత నిరాశకు గురిచేస్తున్నాయి. ఆపిల్ ఇటీవలే తమ ఇతర ప్రొడక్ట్స్ అయిన మ్యాక్‌బుక్ (Macs), ఐప్యాడ్ (iPads) ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. మ్యాక్‌బుక్ ఎయిర్ (MacBook Air) ధర దాదాపు $200 పెరిగింది. అలాగే మ్యాక్ స్టూడియో (Mac Studio) ధర ఏకంగా $500 పెరిగింది. ఐప్యాడ్ ఎయిర్ (iPad Air) ధర కూడా $150 వరకు పెరిగింది. భారత్‌లో కొన్ని మ్యాక్ మోడల్స్ ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు అదే తరహా సరఫరా ఒత్తిడి ఐఫోన్లపైనా పడటంతో ధరల పెంపు తప్పనిసరిగా మారింది.

ఇది కూడా చదవండి: Auto News: రూ.15 వేల EMIకే కొత్త కారు.. ఈ బడ్జెట్‌లో అదిరిపోయే కార్లు ఇవే!

ప్రభావితమయ్యే మోడల్స్ ఇవే:

ఈ ధరల పెంపు ఏ మోడల్స్‌పై ఉంటుందనేది ఆపిల్ అధికారికంగా ప్రకటించనప్పటికీ, నివేదికల ప్రకారం:

  • లేటెస్ట్ సిరీస్: ఐఫోన్ 17 సిరీస్ (iPhone 17, 17 Air, 17 Pro, 17 Pro Max).
  • పాత సిరీస్: ఐఫోన్ 16 సిరీస్ మోడల్స్ కూడా పెరిగే అవకాశం ఉంది.

భారతదేశంలో ప్రస్తుత ఐఫోన్ ధరలు (ప్రారంభ ధరలు):

  • ఐఫోన్ 16 (128GB) – రూ. 69,900
  • ఐఫోన్ 16 ప్లస్ (128GB) – రూ. 79,900
  • ఐఫోన్ 16 ప్రో – రూ. 1,19,900
  • ఐఫోన్ 16 ప్రో మాక్స్ – రూ. 1,44,900
  • ఐఫోన్ 17 (256GB)- రూ. 82,900
  • ఐఫోన్ 17 (512GB)- రూ. 1,02,900
  • ఐఫోన్ 17 ఎయిర్ – రూ. 94,990
  • ఐఫోన్ 17 ప్రో – రూ. 1,34,900
  • ఐఫోన్ 17 ప్రో మాక్స్ – రూ. 1,49,900

ఆపిల్ సంస్థ ఇంకా అధికారికంగా తేదీని కానీ, ధరల వివరాలను కానీ వెల్లడించలేదు. అయితే తయారీ వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులపై ఆ భారం పడటం అనివార్యమని నిపుణులు పేర్కొంటున్నారు. అదే సమయంలో వినియోగదారులకు భారం తగ్గించేందుకు ఆపిల్ కొత్త ‘అప్‌గ్రేడ్ సబ్‌స్క్రిప్షన్’ ప్రోగ్రామ్‌ను కూడా తీసుకొచ్చే యోచనలో ఉంది.

ఇది కూడా చదవండి: Gold Price: సెప్టెంబర్‌లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయో తెలుసా..?

Loading...
Unable to load recommendations.
Follow Us