Airtel Axis Bank Credit Card: ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్. ఈ రెండు సంస్థలు కలిసి సరికొత్త క్రెడిట్ కార్డును అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఎయిర్‌టెల్ (Airtel) యాక్సిస్ బ్యాంకు (Axis Bank) నుంచి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ను విడుదల చేశాయి. ఈ క్రెడిట్ కార్డుపై పలు రకాల ఆఫర్లు కూడా ఉంటాయి. ఎయిర్‌టెల్ కస్టమర్లు ఎయిర్‌టెల్ మొబైల్ యాప్ ద్వారా క్యాష్ బ్యాక్, స్పెషల్ డిస్కౌంట్లు, డిజిటల్ వోచర్స్, కాంప్లిమెంటరీ సర్వీసులను పొందే అవకాశం ఉంటుంది. భారతీయ ఎయిర్‌టెల్, భారత, దక్షిణాసియా సీఈఓ, ఎండీ గోపాల్ విఠల్ మాట్లాడుతూ.. తమ కస్టమర్లకు వరల్డ్ క్లాస్ డిజిటల్ సర్వీసులు ఆఫర్ చేసేందుకు పటిష్టమైన ఫైనాన్షియల్ సర్వీసెస్ పోర్ట్‌పోలియో నిర్మిస్తామన్నారు. టెల్కో-బ్యాంకు భాగస్వామ్యంతో ఎయిర్‌టెల్ కస్టమర్లు యాక్సిస్ బ్యాంకు వరల్డ్ క్లాస్ ఫైనాన్షియల్ సేవలు పొందవచ్చని వెల్లడించారు. ఇక యాక్సిస్ బ్యాంకు సీఈఓ, ఎండీ అమితాబ్ చౌదరి మాట్లాడుతూ.. ఎయిర్‌టెల్ 340 మిలియన్ల మంది కస్టమర్లకు యాక్సిస్ బ్యాంకు డిజిటల్ ఫైనాన్షియల్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు.
ఎయిర్‌టెల్ మొబైల్, డీటీహెచ్ రీచార్జ్, ఎయిర్‌టెల్ బ్లాక్ అండ్ ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీం ఫైబర్ పేమెంట్స్‌పై 25 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందవచ్చు. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ బిల్లు చెల్లింపులు జరిపినట్లయితే 10 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. బిగ్ బాస్కెట్, స్విగ్గీ, జోమాటో ఆర్డర్లపై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇతర ఆన్‌లైన్ పేమెంట్స్‌పై కూడా ఒక శాతం క్యాష్‌బ్యాక్ పొందే సదుపాయం ఉంది. ఇక కార్డు జారీ చేసిన 30 రోజుల్లోపు యాక్టివేట్ చేస్తే రూ.500 విలువైన అమెజాన్ ఈ-వోచన్‌ను పొందవచ్చు.
ఇవి కూడా చదవండి: