Bharti Airtel Q3 Results: త్రైమాసికంలో టెలికం కంపెనీలు దూసుకుపోతున్నాయి. పోటాపోటీగా తమ తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. ఇక భారతీ ఎయిర్‌టెల్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.830 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో పరిశీలిస్తే రూ.854 కోట్లుతో పోల్చితే లాభం స్వల్పంగా 2.8 శాతం తగ్గుముఖం పట్టింది. త్రైమాసిక సమీక్షా కాలంలో ఆదాయం 12.6 శాతం పెరిగి రూ.26,518 కోట్ల నుంచి రూ.29,867 కోట్లకు చేరింది.
అయితే ఇటీవల కాలంలో సవరించిన టారిఫ్ ఫలితాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. ఒక్కో వినియోగదారునిపై ఆదాయం రూ.163తో త్రైమాసికంలో అగ్రగామిగా ఉన్నామని కంపెనీ ఎండీ, సీఈఓ గోపాల్ విట్టల్ తెలిపారు. టారిఫ్‌ల సవరణ పూర్తి ప్రభావం నాలుగో త్రైమాసికంలో స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అన్నారు. కాగా డిసెంబరు నాటికి కంపెనీ కన్సాలిడేటెడ్ నికర రుణ భారం రూ.1.57 లక్షల కోట్లుంది. 4జీ వినియోగదారుల సంఖ్య భారతదేశంలో 16.56 కోట్ల నుంచి 18.1 శాతం వృద్ధితో 19.5 కోట్లకు చేరుకుంది. ఒక్కో వినియోగదారుడు సగటు డేటా వినియోగం 16.37జీబీ నుంచి 11.7 పెరిగి 18.28జీబీకి చేరినట్లు వెల్లడించారు. కాగా, నవంబర్‌లో ఎయిర్‌టెల్ ప్రిపెయిడ్ ప్లాన్ల టారిఫ్‌లను పెంచింది. ఆ తర్వాత రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాలు కూడా ఇదే విధంగా చార్జీలను పెంచాయి.
ఇవి కూడా చదవండి: