Reliance Jio Airtel: టెలికం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్‌ జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్‌..

Reliance Jio Airtel: టెలికం రంగంలో దూసుకుపోతున్న రియలన్స్‌ జియోకు ఎయిర్‌టెల్‌ భారీ షాక్‌ ఇచ్చింది. గత డిసెంబర్‌ నెలలో ఏకంగా 4.05 మిలియన్ల మంది వైర్‌లెస్‌ సబ్‌ ..

Reliance Jio Airtel: టెలికం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్‌ జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్‌..

Updated on: Feb 22, 2021 | 8:53 PM

Reliance Jio Airtel: టెలికం రంగంలో దూసుకుపోతున్న రియలన్స్‌ జియోకు ఎయిర్‌టెల్‌ భారీ షాక్‌ ఇచ్చింది. గత డిసెంబర్‌ నెలలో ఏకంగా 4.05 మిలియన్ల మంది వైర్‌లెస్‌ సబ్‌ స్క్రైబర్లను సంపాదించుకుంది. అంతేకాదు నెలవారీ సబ్‌స్రైబర్ల విషయంలో అగ్రస్థానాన్ని నిలిచింది. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తెలిపిన ప్రకారం.. గత సంవత్సరం డిసెంబర్‌లో రిలయన్స్‌ జియోకు 4,79,000 మంది వైర్‌లెస్ ఖాతాదారులు మాత్రమే తోడు కాగా, విజిటర్ లొకేషన్ రిజిస్టర్ (వీఎల్ఆర్)లోనూ జియోను ఎయిర్‌టెల్ బీట్ చేసింది.

ఇక తాజాగా వచ్చి చేరిన 4.05 మిలియన్ల మందితో కలుపుకొని గత సంవత్సరం డిసెంబర్‌ 31 నాటికి ఎయిర్‌ టెల్‌ వైర్‌లెస్‌ సబ్‌స్క్రైబర్ల మొత్తం సంఖ్య 338.7 మిలియన్ల వరకు చేరింది. ఎయిర్‌టెల్ మార్కెట్ షేర్ 29.36గా ఉంది. అంతకుముందు నెల అది 28.97 గా ఉంది. ఇక, జియోకు డిసెంబరు నెలలో 478,917 మంది ఖాతాదారులు మాత్రమే వచ్చి చేరారు.
మార్కెట్‌ షేర్‌ 35.43 శాతంగా ఉంది. అంతకు ముందు నెల 35.34 శాతంతో పోలిస్తే స్వల్ప పెరుగుదల కనిపించింది. ఇక ఇదే సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 252,501 మంది ఖాతాదారులను కోల్పోగా వొడాఫోన్‌ ఐడియా 5.69 మిలియన్ల మందిని కోల్పోయింది.

Amara Raja Batteries: అమర రాజా లిథియం అయాన్‌ బ్యాటరీ కంపెనీ కీలక నిర్ణయం.. తిరుపతిలో ఉత్పత్తి యూనిట్‌..!