
ఈ రొజుల్లో ఏ చిన్న వస్తువు కావాలన్నా ఆన్‌లైన్‌లోనే చూస్తున్నారు. ముఖ్యంగా ఫెస్టివల్స్ సీజన్ లో ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా జరుగుతుంది. అయితే ఆఫర్ల మోజులో పడి కొన్ని సార్లు ప్రొడక్ట్ ఒరిజినలా కాదా అన్నది చూసుకోవడం మర్చిపోతారు. దీంతో ఫేక్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసి నష్టపోతారు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి యాప్స్ లో ఇటీవల ఇలాంటి ఫేక్ ప్రొడక్ట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఫెస్టివల్ షాపింగ్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి!
ఆన్‌లైన్‌లో ఒక ప్రొడక్ట్ కొనేముందు ఆ ప్రొడక్ట్ ను అమ్ముతున్న సెల్లర్ ఎవరనేది చెక్ చేసుకోవాలి. కిందకి స్క్రోల్ చేస్తే.. సెల్లర్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఆయా సెల్లర్ నేమ్ ను గూగుల్‌లో సెర్చ్ చేయొచ్చు లేదా కస్టమర్లు ఇచ్చిన రీవ్యూస్ చదివి కూడా ఆ సెల్లర్ ఒరిజినలా కాదా అన్నది కన్ఫర్మ్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో ఏదైనా ప్రొడక్ట్ కొనేముందు తొందరలో బ్రాండ్ నేమ్ స్పెల్లింగ్ ను సరిగ్గా చెక్ చేయడం మర్చిపోతాం. దీంతో ఒరిజినల్ ను పోలి ఉండే ఫేక్ ప్రొడక్ట్ ఇంటికి వస్తుంది. ఇలా చాలామంది మోసపోతుంటారు. చూసినప్పుడు ఒరిజినల్ బ్రాండ్ నేమ్ లా కనిపిస్తుంది. కాస్త క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ఒక్క అక్షరం తేడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి మోసాల బారిన పడకూడదంటే బ్రాండ్ నేమ్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి.
ఆన్ లైన్ లో వస్తువులు కొనేటప్పుడు కొన్ని సార్లు పాడైనవి, ఫేక్ వి రావొచ్చు. ఇలా జరిగినప్పుడు వెంటనే వాటిని రిటర్న్ చేసి మన డబ్బులు మనం పొందొచ్చు. అయితే ఒకవేళ ఆ వస్తువుకి నో రిటర్న్ పాలసీ ఉంటే అప్పుడు దాన్ని రిటర్న్ చేయడం కుదరదు. అందుకే ఏ ప్రొడక్ట్ అయినే కొనేముందు కచ్చితంగా రిటర్న్ పాలసీ చెక్ చేయాలి. రిటర్న్ ఆప్షన్ ఉంటేనే కొనాలి. అలాగే గ్యారంటీ, వ్యారంటీ ఆప్షన్స్ కూడా చెక్ చేసుకోవడం మంచిది.
ఆన్ లైన్ లో ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి రావడం, బాక్స్ లో మొబైల్‌కు బదులు రాళ్లు ఉండడం వంటివి తరచూ మనం చూస్తూనే ఉంటాం. అందుకే ఇలాంటి మోసాలను నివారించేందుకు అన్ ప్యాకింగ్ వీడియో తీయాలి. అంటే డెలివరీ బాయ్ ముందే వీడియో తీస్తూ బాక్స్ ఓపెన్ చేయాలి. ఇలా చేస్తే నకిలీ ప్రొడక్ట్ వచ్చినప్పుడు కంప్లెయింట్ చేసేందుకు వీలుంటుంది.
ఆన్ లైన్ ప్రొడక్ట్ విషయంలో ఏవైనా మోసాలు జరిగితే మీరు కంజ్యూమర్ కోర్ట్ లో కంప్లెయింట్ చేయొచ్చు. ఆన్ లైన్ లో తప్పుగా డీటెయిల్స్ పెట్టి అమ్మడం, రిటర్న్ పాలసీ ఉన్నా కూడా రిటర్న్ తీసకోకపోవడం, వ్యారెంటీ క్లెయిమ్ యాక్సెప్ట్ చేయకపోవడం వంటి వాటిపై ఆ కోర్టులో ఫిర్యాదు చేయొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం