Tax Saving Investments: వీటిల్లో పెట్టుబడి పెడితే చాలు.! రాబడి మామూలుగా ఉండదు! చెక్ ఫ్యాక్ట్స్..

మీ నెలవారీ సేవింగ్స్ ను ఏదైనా సురక్షిత పథకంలో పెట్టుబడి పెట్టాలి అని ఆలోచిస్తున్నారా! అదికూడా పన్ను రాయితీతో కూడిన పథకమైతే బాగుండని భావిస్తున్నారా! అయితే ఈ స్టోరీ మీ కోసమే..

Tax Saving Investments: వీటిల్లో పెట్టుబడి పెడితే చాలు.! రాబడి మామూలుగా ఉండదు!  చెక్ ఫ్యాక్ట్స్..
Best Tax Saving Investment Schemes That Give Lumsum Returns
Follow us

|

Updated on: Dec 11, 2022 | 10:13 AM

మీ నెలవారీ సేవింగ్స్ ను ఏదైనా సురక్షిత పథకంలో పెట్టుబడి పెట్టాలి అని ఆలోచిస్తున్నారా! అదికూడా పన్ను రాయితీతో కూడిన పథకమైతే బాగుండని భావిస్తున్నారా! అయితే ఈ స్టోరీ మీ కోసమే.. అవునండీ నిజమే నెలవారీ స్వల్ప వాయిదాల్లో లేదా సంవత్సరపు పెట్టుబడులుగానూ ఆయా పథకాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటిల్లో వడ్డీ సాధారణంగా బ్యాంకు అందించే దాని కన్నా అధికంగా ఉంటుంది. పైగా మనం జమ చేసిన అసలు, దానిపై వచ్చే వడ్డీ మొత్తంపై పన్ను రాయితీ కూడా వర్తిస్తుంది.

ప్లానింగ్ అవసరం.. ఆధునిక జీవన విధానంలో ఖర్చులు చాలా పెరిగాయి. నెలంతా సంపాదించిన సొమ్ము గంటల వ్యవధిలో ఆవిరైపోతోంది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ బడ్జెట్ కు ప్రాధాన్యం పెరిగింది. నెలవారి రాబడి, ఖర్చులు, ఆదా చేసుకోవాల్సిన మొత్తం.. ఇలా పక్కా ప్రణాళిక చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రతి నెలా ఖర్చులు పోను.. ఎంతోకొంత సేవింగ్స్ మాత్రం తప్పనిసరి. అలా ఆదా అవుతున్న సొమ్మును చాలా మంది ఇంట్లోనే లేక బ్యాంక్ అకౌంట్లోనే దాచుకుంటుూ ఉంటారు. అయితే ఇలా అకౌంట్లలో దాచుకునే బదులు కొన్ని లాంగ్ టర్మ్ పొదుపు పథకాలలో పెట్టుబడి పెడితే.. భారీ ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అది కూడా పన్ను రాయితీలతో కూడిన పథకాలైతే మేలంటున్నారు. అటువంటి పథకాలు మనకు చాలానే అందుబాటులో ఉన్నాయని వివరిస్తున్నారు. అందులో ప్రధానమైన కొన్ని పథకాల గురించి ఇప్పడు తెలుసుకుందాం..

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) పన్ను రాయితీతో కూడిన దీర్ఘ కాలపు పెట్టుబడి పథకాల్లో అత్యంత సురక్షిత, అందరూ ఎక్కువగా వినియోగించే స్కీమ్ పీపీఎఫ్. ఈ పథకంలో పెట్టే పెట్టుబడికి ఇన్కమ్ ట్యాక్స్ చట్టం సెక్షన్ 80 సీ ప్రకారం పన్ను రాయితీ దొరకుతుంది. దీనిలో ఏడాదికి అత్యధికంగా రూ. 1.5లక్షల వరకూ నెలల వారీగా పెట్టుబడి పెట్టవచ్చు.7.1 శాతం వడ్డీ లభిస్తుంది. లాంగ్ టర్మ్ లో ఈ పథకం మంచి రాబడిని ఇస్తుంది.

మ్యూచువల్ ఫండ్స్.. అధిక రాబడితో పాటు ట్యాక్ బెనిఫిట్స్ వచ్చే మరో స్కీమ్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్(ఈఎల్ ఎస్ ఎస్). లాంగ్ టర్మ్ లో పెట్టుబడి దారులకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ చట్టం సెక్షన్ 80 సీ ప్రకారం పన్ను రాయితీ లభిస్తుంది. దీనిలో ఏడాదికి రూ. 1.5 లక్షల వరకూ ట్యాక్స్ రీబేట్ చేయవచ్చు .

నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్ పీ ఎస్) ప్రభుత్వం అందించే సురక్షిత ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ ఎన్ పీ ఎస్. పెట్టుబడి దారులు దీనికి రిటైర్మెంట్ కార్పస్ కింద భావిస్తారు. దీనిలో పెట్టే పెట్టుబడికి సెక్షన్ 80సీసీడీ కింద రూ. 2 లక్షలు, సెక్షన్ 80 సీసీడీ(1) కింద రూ. 1.5 లక్షలు, అలాగే సెక్షన్ 80 సీసీడీ(1బీ) కింద మరో 50,000 మాత్రమే ట్యాక్స్ డిడక్ట్ కావడానికి అవకాశం ఉంది.

ఇన్స్యూరెన్స్ ప్లాన్స్.. లైఫ్, హెల్త్ ఇన్స్యూరెన్స్ వంటి స్కీమ్స్ కూడా ట్యాక్స్ సేవింగ్ కు ఉపకరిస్తాయి. అంతేకాక అత్యవసర పరిస్థితుల్లో ఇవి ఆదుకుంటాయి.

ప్రావిడెండ్ ఫండ్(పీఎఫ్) మరో పన్ను రాయితీతో కూడిన రిటైర్మెంట్ స్కీమ్ ప్రావిడెండ్ ఫండ్. ఏదైనా సంస్థలో పనిచేసే ఉద్యోగులకు తప్పనిసరిగా ఎంప్లాయీ ప్రావిడెండ్ ఫండ్ (ఈపీఎఫ్) ఉంటుంది. దీనికి కూడా ట్యాక్ రీబేట్కు సెక్షన్ 80 సీ కింద అవకాశం ఉంటుంది.

వీటితో పాటు ఆడపిల్లల తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం అందించే సుకన్య సమృద్ధి యోజన పథకంలో కూడా పన్ను రాయితీ లభిస్తుంది. అవకాశం ఉంటే ఇటువంటి లాంగ్ టర్మ్ ఇన్ వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా ట్యాక్స్ సేవ్ అవడంతో పాటు వచ్చే రిటర్న్స్ కూడా అధికంగా ఉంటాయి.

Latest Articles