Best Selling Cars
భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలో ప్రతి సంవత్సరం మిలియన్ల కొద్దీ కార్లు అమ్ముడవుతున్నాయి. మారుతి సుజుకి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కారు. ఈ కంపెనీ కార్లు సరసమైన ధర, మంచి మైలేజీకి ఇస్తుండటంతో ఎంతో మంది ఇష్టపడతారు. గత జూన్‌లో కూడా మారుతీ అత్యధిక కార్లను విక్రయించింది. దీని తరువాత, హ్యుందాయ్ రెండవ నంబర్‌లో ఉంది. హ్యుందాయ్ క్రెటా అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీ. జూన్ 2023లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన 25 కార్ల జాబితా విడుదలైంది. ఇందులో మారుతి వ్యాగన్ఆర్ అగ్రస్థానంలో ఉంది.
టాప్-25 బెస్ట్ సెల్లింగ్ కార్లు (జూన్ 2023)
- మారుతీ వ్యాగన్ ఆర్- 17,481 యూనిట్లు అమ్మకం
- మారుతీ స్విఫ్ట్- 15,955 యూనిట్లు
- హ్యుందాయ్ క్రెటా- 14,447 యూనిట్లు
- మారుతీ బాలెనో- 14,077 యూనిట్లు
- టాటా నెక్సాన్- 13,827 యూనిట్లు
- హ్యుందాయ్ వెన్యూ 11,606 యూనిట్లు
- మారుతి ఆల్టో- 11,323 యూనిట్లు
- టాటా పంచ్- 10,990 యూనిట్లు
- మారుతి బ్రెజ్జా- 10,578 యూనిట్లు
- మారుతి గ్రాండ్ విటారా- 10,486 యూనిట్లు
- మారుతి ఈకో- 9354 యూనిట్లు
- మారుతి డిజైర్ – 93.224 యూనిట్లు
- మహీంద్రా బొలెరో – 8686 యూనిట్లు
- మహీంద్రా స్కార్పియో N+ క్లాసిక్ – 8648 యూనిట్లు
- మారుతి ఎరిటిగా – 8422 యూనిట్లు
- టయోటా ఇన్నోవా – 8361 యూనిట్లు
- టాటా టియాగో – 8135 యూనిట్లు
- కియా కేరెన్స్ – 8047 యూనిట్లు
- మారుతీ ఫ్రాంక్స్ – 7991 యూనిట్లు
- కియా సోనెట్ – 7722 యూనిట్లు
- టాటా ఆల్ట్రోజ్ – 7250 యూనిట్లు
- హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 -6321 యూనిట్లు
- హ్యుందాయ్ i20 – 6162 యూనిట్లు
- మహీంద్రా XUV700 – 5391 యూనిట్లు
- మహీంద్రా XUV300 – 5094 యూనిట్లు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి