Best Scooters In India: కొత్త స్కూటర్ కొనాలనుకుంటున్నారా? రూ. 90 వేల లోపు బెస్ట్ మైలేజ్ స్కూటర్స్ ఇవే..!

కొత్త స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసం తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే స్కూటర్లు చాలానే ఉన్నాయి. తక్కువ ధరకే లభిస్తూ మంచి మైలేజ్, అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ కలిగి ఉన్న కొన్ని బెస్ట్ స్కూటర్స్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

Best Scooters In India: కొత్త స్కూటర్ కొనాలనుకుంటున్నారా?  రూ. 90 వేల లోపు బెస్ట్ మైలేజ్ స్కూటర్స్ ఇవే..!
Best Scooters In India

Updated on: Oct 25, 2025 | 3:56 PM

జీయస్టీ 2.0 తర్వాత ఆటోమొబైల్స్ ధరలు తగ్గిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బైక్ లు, స్కూటర్ల ధరలు బాగా తగ్గాయి. ఒకప్పుడు స్కూటర్ ధర మినిమం రూ. లక్షకు పైగానే ఉండేది. కానీ ఇప్పుడు రూ. 90 వేలలో కూడా స్కూటర్లు లభిస్తున్నాయి. కొత్త స్కూటర్ కొనాలనుకునేవారికి ఇదే మంచి సమయం.  తక్కువ ధరకే  ప్రీమియం డిజైన్, మంచి మైలేజీ, అడ్వాన్స్‌డ్  ఫీచర్లతో బోలెడు స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని బెస్ట్ స్కూటర్స్ లిస్ట్ ఓసారి చూస్తే..

టీవీఎస్ జూపిటర్ 125

టీవీఎస్ జూపిటర్ 125 స్కూటర్ మార్కెట్లో మంచి సేల్స్ తో దూసుకుపోతుంది. దీని బేసిక్ వేరియంట్ ధర రూ. 75,600 ఉంది. ఈ స్కూటర్ సింగిల్-సిలిండర్, 4- స్ట్రోక్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది లీటర్ కు 50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.  డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ స్కూటర్ ఫ్యామిలీకి బాగా సూట్ అవుతుంది.

హీరో డెస్టినీ 125

హీరో డెస్టినీ 125 స్కూటర్ ధర రూ. 75,838 ఉంది.  ఇది లీటరుకు దాదాపు 60 కి.మీ మైలేజీని అందిస్తుంది. లైట్ వెయిట్ తో మంచి డిజైన్ తో వస్తుంది. ఇందులో డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. ఇందులో పలు కొత్త ఫీచర్లు ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు.

హోండా యాక్టివా 110

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో హోండా యాక్టివా ఒకటి. ఇది 110 సీసీ ఇంజిన్ తో వస్తుంది. బేసిక్ మోడల్ ధర రూ. 74,369 ఉంది. ఇందులో 4 -స్ట్రోక్ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఉంటుంది. డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. లీటర్ కు 40 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.  ఇది కూడా బెస్ట్ ఫ్యామిలీ స్కూటర్స్ లో ఒకటి.

సుజుకి యాక్సెస్ 125

మార్కెట్లో మంచి పెర్ఫామెన్స్ ఇచ్చే స్కూటర్స్ లో సుజుకి యాక్సెస్ 125 కూడా ఒకటి. ఇది 4 స్ట్రోక్, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. స్టాండర్డ్ డ్రమ్ బ్రేక్ మోడల్ ధర రూ. 77,284గా ఉంది.  ఇది 4.2- అంగుళాల TFT డిజిటల్ కన్సోల్‌తో వస్తుంది. మైలేజ్ లీటర్ కు 40 కిలోమీటర్లు ఇస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.