
కేవలం డేటా మాత్రమే కావాలనుకునేవారు, సిమ్ ను యాక్టివ్ గాఉంచుకోవాలనుకునేవారు అత్యంత చౌకగా లభించే ప్లాన్స్ ను ఎంచుకోవచ్చు. కాల్స్ అవసరం లేనివాళ్లు కేవలం ఆన్ లైన్ ఛాటింగ్, వాట్సాప్ కాలింగ్, ఆన్ లైన్ మీటింగ్స్ వంటి అవసరాలు ఉన్నవాళ్లు ఈ ప్లాన్ ను ఎంచుకోవచ్చు. ఎయిర్ టెల్, జియోలలో ఇలాంటి చౌకైన ప్లాన్స్ చాలానే ఉన్నాయి. వాటిలో రూ.100 కంటే తక్కువ ధర ఉన్న బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
జియోలో కేవలం డేటా కోసం రూ.39 ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్యాక్ మూడు రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 3జీబీ డేటా వస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు లేదా తక్కువ రోజుల్లో ఎక్కువ డేటా అవసరమయ్యే వారికి ఈ ప్లాన్ బెస్ట్. ఇక రూ.77 పెడితే 3 జీబీ డేటా 5 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అలాగే కేవలం ఒక్కరోజుకి డేటా కావాలనుకునేవాళ్లు రూ. 49 పెట్టి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక్కరోజు వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ డేటా లభిస్తుంది. ఇకపోతే రూ. 29కి 2జీబీ డేటా 2 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది.
ఇక ఎయిర్‌టెల్ రూ.33లకు ఒక డేటా ప్లాన్ అందుబాటులో ఉంది. అయితే ఈ ప్లాన్ ఒక రోజు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఒక్కరోజులో కేవలం 2జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. కేవలం డేటా మాత్రమే కావాలి అనుకునేవారికి రూ.77 ప్లాన్ అందుబాటులో ఉంది. ఇందులో 5 జీబీ డేటా లభిస్తుంది. ఇది వారం రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అదే రూ.100 పెడితే 6 జీబీ డేటా పొందొచ్చు. ఈ ప్యాక్ నెలరోజుల వ్యాలిడిటీతో వస్తుంది.