సెకండ్ హ్యాండ్ బైక్‌కోసం చూస్తున్నారా?.. రూ. 15వేలు మీ చేతిలో ఉంటే అద్భుతమైన బైక్ మీసొంతం.. వివరాలు మీకోసం..

Second Hand Bikes: ప్రస్తుతం మార్కెట్‌లో ద్విచక్ర వాహనాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏ బైక్ కొనాలన్నా...

సెకండ్ హ్యాండ్ బైక్‌కోసం చూస్తున్నారా?.. రూ. 15వేలు మీ చేతిలో ఉంటే అద్భుతమైన బైక్ మీసొంతం.. వివరాలు మీకోసం..
Second Hand Bike
Follow us
Shiva Prajapati

| Edited By: Team Veegam

Updated on: Apr 07, 2021 | 6:36 PM

Second Hand Bikes: ప్రస్తుతం మార్కెట్‌లో ద్విచక్ర వాహనాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏ బైక్ కొనాలన్నా చేతిలో కొద్దిలొ కొద్దిగా అయినా ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉండాల్సిందే. అలా అయితేనే కొత్త బైక్ ఏమైనా కొనగలిగే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బైక్ కొనాలనుకునే వారు సెకండ్ హ్యాండ్ బైక్‌లపై దృష్టి సారిస్తున్నారు. సెకండ్ హ్యాండ్ బైక్‌లు అయితే, తక్కువ ధరకు లభించడమే కాకుండా.. మంచి కండీషన్‌లో ఉన్న బైక్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చాలా మంది సెకండ్ హ్యాండ్ బైక్‌ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఇలా సెకండ్ హ్యాండ్ బైక్‌లను కొనుగోలు చేసే వారి కోసం మార్కెట్‌లో ప్లేస్‌లు ఉన్నాయి. తాజాగా ఆన్‌లైన్ అమ్మకాలు కూడా సాగుతున్నాయి. ఆన్‌లైన్ కొన్ని సైట్లలో సెకండ్ హ్యాండ్ బైక్‌లను అత్యంత తక్కువ ధరకే అమ్మకానికి పెడుతున్నారు. స్పోర్ట్స్ బైక్‌‌లు సహా, అన్ని రకాల బైక్‌లు సరసమైన ధరలకే అందుబాటులో ఉంచుతున్నారు.

ఇటీవలి కాలంలో డ్రూమ్ వెబ్‌సైట్ పేరు సెకండ్ హ్యాండ్ బైక్స్‌ విక్రయానికి ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ డ్రూమ్ వెబ్‌సైట్ ద్వారా మీరు సులభంగా సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ సైట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్, పల్సర్ వంటి బైక్‌లు అత్యంత తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి. తాజాగా డ్రూమ్‌లో బజాజ్ పల్సర్ 150 సీసీ బైక్‌ను కేవలం రూ. 15,000 అమ్మకానికి పెట్టారు. 2008 మోడల్ బైక్ అయిన ఈ పల్సర్ మొత్తం 36వేల కిలోమీటర్లు తిరిగింది. అలా, బజాజ్ కంపెనీకి చెందిన మరికొన్ని బైక్‌లు సహా, హోండా, టీవీఎస్, వంటి కంపెనీలకు చెందిన సెకండ్ హ్యాండ్ బైక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ డ్రూమ్ వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టిన సెకండ్ హ్యాండ్ బైక్‌లలో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ పరిధిలో కూడా ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు వీటిని కూడా పరిశీలిస్తే బెటర్.

Also read: కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై వర్క్ ప్లేస్‌లలోనూ కోవిడ్ వ్యాక్సినేషన్‌కు అనుమతి.!

Earhquake: భారీ భూకంపం.. సిక్కిం-నేపాల్, అస్సాం, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కంపించిన భూమి..

IPL 2021: ముంబై ఇండియన్స్ ఐదుసార్లు టైటిల్ గెలుచుకుంది.. ఇప్పటివరకు ఎన్ని జట్టు ఐపీఎల్ ఛాంపియన్ల నిలిచాయో తెలుసా..