Gold Investment: కనిపించని బంగారంపై బంగారం లాంటి పెట్టుబడి.. మీరూ ఓ సారి పెట్టుబడి పెట్టండి

| Edited By: Basha Shek

Feb 18, 2023 | 1:46 PM

భారతదేశంలో వాడే బంగారంలో ఎక్కువ శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుందే. కాబట్టి బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా పెరుగుతుంది.

Gold Investment: కనిపించని బంగారంపై బంగారం లాంటి పెట్టుబడి.. మీరూ ఓ సారి పెట్టుబడి పెట్టండి
Sovereign Gold Bond
Follow us on

మగువలకు బంగారమే సింగారం. కష్టపడిన సంపాదించిన సొమ్మంతా ఆడవారికి బంగారు ఆభరణాలు చేయిస్తుంటారు. అయితే బంగారం కొనడం వెనుక రెండు కారణాలు ఉన్నాయి నలుగురి హుందా తనం కోసం బంగారం ధరించడంతో పాటు అత్యవసర సమయాల్లో బంగారం ఓ హామీగా కష్టాల నుంచి బయటపడేసే పెట్టుబడిగా ఉంటుంది. అయితే భారతదేశంలో వాడే బంగారంలో ఎక్కువ శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుందే. కాబట్టి బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా పెరుగుతుంది. అలాగే మనం భౌతిక బంగారం కొంటే దాన్ని దాచుకోవడానికి కూడా ఇబ్బంది పడాలి. ఇలాంటి ఇబ్బందులను తీరిస్తూ కేవలం బంగారాన్ని పెట్టుబడి కిందే చూసే వారికి కొన్ని పథకాలు అందుబాటులో ఉన్నాయి. కేవలం బాండ్స్ ద్వారా తమ పెట్టుబడి పెట్టుకుని మనకు అవసరం వచ్చిన సమయంలో ఆ రోజు బంగారం రేట్ కు అనుగుణంగా అమ్ముకునే అవకాశం ఉంటుంది. భారతదేశంలో బంగారంపై పెట్టుబడి పెట్టడానికి అనువుగా ఉండే పథకాలేంటో ఓ సారి తెలుసుకుందాం. 

డిజిటల్ గోల్డ్

కొన్ని బ్యాంకులు, ఫిన్ టెక్ కంపెనీలు, నగదు దుకాణ కంపెనీలు పెట్టుబడి దారులను డిజిటల్ గోల్డ్ కొనడానికి అనుమతిస్తాయి. ఫిజికల్ గా బంగారం కొంటే ఎలాంటి ప్రయోజనాలు వర్తిస్తాయో? డిజిటల్ గోల్డ్ కొన్నా అవే నిబంధనలు వర్తిస్తాయి. అదనంగా బంగారాన్ని దాచుకోవాల్సిన కష్టం తొలగుతుంది. మనం కొన్న గోల్డ్ ను బీమా చేయించిన వ్యాలెట్స్ లో నిల్వ చేస్తారు. అయితే డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు సెబీ నిబంధనల పరిధిలోకి రావు. 

ఇవి కూడా చదవండి

గోల్డ్ ఈటీఎఫ్ లు

గోల్డ్ ఇటిఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడం అంటే స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడం. కానీ భౌతిక బంగారంలా కాకుండా, స్థానిక పన్నుల కారణంగా రాష్ట్రాలలో దీని ధర మారుతూ ఉంటుంది. బంగారు ఈటీఎఫ్ లు ప్రస్తుత బంగారం ధరలను ప్రతిబింబిస్తాయి. పెట్టుబడిదారులు తమ డీమ్యాట్ ఖాతా ద్వారా బంగారు ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌ ల్లో ఇన్వెస్ట్ చేయడం అంటే 99.5 శాతం స్వచ్ఛత ఉన్న బంగారంపై ఇన్వెస్ట్ చేయడంతో సమానం.  

సావరిన్ గోల్డ్ బాండ్లు

సావరిన్ గోల్డ్ బాండ్‌లు లేదా ఎస్ జీబీలు గ్రాముల బంగారంతో కూడిన ప్రభుత్వ సెక్యూరిటీలు. పెట్టుబడిదారులు ఇష్యూ ధరను నగదు రూపంలో చెల్లించాలి. అలాగే మెచ్యూరిటీపై బాండ్లు నగదు రూపంలో రీడీమ్ చేస్తారు. బాండ్‌ను భారత ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తుంది. 2015లో ప్రవేశపెట్టిన ఈ బాండ్‌లు ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్‌తో ఎనిమిది సంవత్సరాల కాలవ్యవధిని కలిగి ఉంటాయి. అయితే, ఇన్వెస్టర్లు మెచ్యూరిటీకి ముందే బాండ్‌ని విక్రయించడాన్ని ఎంచుకోవచ్చు. పెట్టుబడిదారులు స్టాక్ ఎక్స్ఛేంజీలలో ఎప్పుడైనా బాండ్లను కూడా చేయవచ్చు.

గోల్డ్ మూచ్యువల్ ఫండ్స్

వీటిని గోల్డ్ సేవింగ్ ఫండ్స్ అని కూడా పిలుస్తారు. ఇవి గోల్డ్ ఈటీఎఫ్‌ ల్లో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్స్. అయితే పెట్టుబడిదారులకు గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి డీమ్యాట్ ఖాతా అవసరం లేదు. గోల్డ్ సేవింగ్స్ ఫండ్స్‌లో, పెట్టుబడిదారుడు తన కార్పస్‌లో ఎక్కువ భాగం  గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడి పెడతాడు. కొంత భాగం మనీ మార్కెట్ సాధనాల్లో లేదా కొన్ని స్వల్పకాలిక రుణ ఉత్పత్తులలో కూడా ఉండవచ్చు.

గోల్డ్ డెరివేటివ్స్

గోల్డ్ ఫ్యూచర్స్, ఆప్షన్స్ డెరివేట్ కాంట్రాక్టులు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో అందుబాటులో ఉన్నాయి. గోల్డ్ డెరివేటివ్ల రెండు తరగతులు సాధారణంగా నిర్వహిస్తారు, ఫార్వర్డ్‌లు, ఫ్యూచర్‌లు వంటి రెండు వర్గాల్లో ఎంపికలు ఉంటాయి. ఫార్వర్డ్ కాంట్రాక్టులు ద్వైపాక్షిక బెస్పోక్ ఒప్పందాలైదే భవిష్యత్ ఒప్పందాలు రిజిస్టర్డ్ ఎక్స్ఛేంజీలలో ప్రామాణికంగా వ్యాపారం చేస్తారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి