Business Idea: ఈ మిషన్‌ ఉంటే చాలు.. రెండు గంటలు పనిచేస్తే నెలకు రూ. 30 వేలు పక్కా ఆదాయం

|

May 16, 2024 | 9:05 AM

అలాంటి ఓ బెస్ట్‌ బిజినెస్‌ ప్లాన్‌ గురించి ఈ రోజు తెలుసుకుందాం. సాధారణంగా ఇంట్లో ఉదయం లేవగానే చాలా మంది చేసే పని పాత్రలను శుభ్రం చేయడం ఇందుకోసం కచ్చితంగా స్క్రబర్‌ను ఉపయోగిస్తుంటాం. మరి ఈ స్క్రబర్‌ తయారీని వ్యాపారంగా మార్చుకుంటే భలే లాభాలు ఉంటాయి కదూ! అయితే మీరు స్బ్రబర్‌ను తయారు చేయాల్సిన అవసరం ఉండదు...

Business Idea: ఈ మిషన్‌ ఉంటే చాలు.. రెండు గంటలు పనిచేస్తే నెలకు రూ. 30 వేలు పక్కా ఆదాయం
Scrubber Packing
Follow us on

ప్రస్తుతం పెరిగిన ధరలతో ఒక్క ఆదాయం సరిపోని పరిస్థితి ఉంది. అందుకే చాలా మంది సైడ్‌ ఇన్‌కమ్‌ వచ్చేలా మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందుకోసం కొందరు ఉద్యోగం చేస్తూనే వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వ్యాపారంగా అనగానే గంటల తరబడి టైమ్‌ స్పెండ్‌ చెయ్యాలి. లక్షల్లో ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచనతో ఉంటారు చాలా మంది. కానీ తక్కువ పెట్టుబడితో ఎలాంటి రిస్క్‌ లేకుండా కూడా వ్యాపారం చేయొచ్చని మీకు తెలుసా.? ఇందుకోసం మార్కెట్లో ఎన్నో రకాల వ్యాపారాలు అందుబాటులో ఉన్నాయి.

అలాంటి ఓ బెస్ట్‌ బిజినెస్‌ ప్లాన్‌ గురించి ఈ రోజు తెలుసుకుందాం. సాధారణంగా ఇంట్లో ఉదయం లేవగానే చాలా మంది చేసే పని పాత్రలను శుభ్రం చేయడం ఇందుకోసం కచ్చితంగా స్క్రబర్‌ను ఉపయోగిస్తుంటాం. మరి ఈ స్క్రబర్‌ తయారీని వ్యాపారంగా మార్చుకుంటే భలే లాభాలు ఉంటాయి కదూ! అయితే మీరు స్బ్రబర్‌ను తయారు చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం స్బ్రబర్స్‌ను ప్యాక్‌ చేసి వాటిని విక్రయించడమే మీ పని. మార్కెట్‌లో స్క్రబర్‌ ప్యాకింగ్ మిషన్స్‌ను పలు సంస్థలు అందిస్తున్నాయి. అంతేకాకుండా వాటికి అవసరమయ్యే ముడి సరుకును కూడా వారే అందిస్తుంటారు.

స్బ్రబర్‌ ప్యాకింగ్ కోసం ఒక మిషన్‌ అవసరపడుతుంది. అలాగే స్క్రబర్‌ ముడి సరుకు, ప్యాకింగ్ చేయడానికి ఒక షీట్‌ కావాల్సి ఉంటుంది. ముందుగా మిషన్‌లో ఉండే హోల్స్‌లో ముందుగా కప్పులను పెట్టి అనంతరం వాటిలో స్క్రబర్‌ను పెట్టాలి. అనంతరం పైనుంచి షీట్‌ను పెట్టి, మిషన్‌పై నుంచి నొక్కాలి. అంతే ఆటోమెటిక్‌గా సెట్‌ చేసిన టెంపరేచర్‌తో స్క్రబర్స్‌ ప్యాక్‌ అవుతాయి. ఈ షీట్‌ను మీ సొంతం బ్రాండింగ్‌తో కూడా తయారు చేసుకోవచ్చు. తయారీ అనంతరం మీకు సమీపంలో ఉన్న దుకాణాల్లో హోల్‌సేల్‌ ధరకు విక్రయించుకోవచ్చు.

ఇక పెట్టుబడి విషయానికొస్తే స్క్రబర్‌ ప్యాకింగ్‌కు అవసరపడే షీటు ధర రూ. 7.80 గా ఉంటుంది. అలాగే ఒక కప్పు 55 పైసలు ఉంటుంది. ఇక ఒక కిలో స్క్రబ్‌ ధర రూ. 230గా ఉంటుంది. ఒక కిలో ముడి సరుకుతో 125 స్బ్రబర్‌లను తయారు చేసుకోవచ్చు. ఇక మిషన్‌ విషయానికొస్తే రూ. 30 వేలుగా ఉంటుంది. ఒక స్బ్రబర్‌ షీట్‌ను తయారు చేయడానికి రూ. 42 అవుతుంది. అంటే 12 స్క్రబర్‌ల తయారీకి అయ్యేది కేవలం రూ. 42 మాత్రమే. మార్కెట్లో ఒక్కో స్బ్రబర్‌ను రూ. 10 విక్రయిస్తారు. మనం హోల్‌సేల్‌లో ఒక షీట్‌ను రూ. 10 లాభానికి విక్రయించినా.. రోజుకు 100 షీట్స్‌ తయారు చేస్తే రూ. 1000 పొందొచ్చు.ఇలా నెలకు రూ. 30 వేలు ఆర్జించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..