Business Idea: ఉన్న ఊర్లోనే ఉంటూ లక్షలు సంపాదించే అవకాశం.. బెస్ట్‌ బిజినెస్‌ ప్లాన్‌

కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూనే చేసుకునే వ్యాపారాలు కూడా ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో, నష్టాలు ఉండని వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి బెస్ట్‌ వ్యాపారాల్లో పౌల్ట్రీ ఫామ్‌ ఒకటి. కాలంతో సంబంధం లేకుండా నాన్‌ వెజ్‌ ప్రియులు ఎంతో ఇష్టంగా చికెన్‌ తింటుంటారు. అందుకే పౌల్ట్రీ ఫామ్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి లాభాలను ఆర్జించవచ్చు...

Business Idea: ఉన్న ఊర్లోనే ఉంటూ లక్షలు సంపాదించే అవకాశం.. బెస్ట్‌ బిజినెస్‌ ప్లాన్‌
Business Idea

Updated on: May 27, 2024 | 8:58 PM

పెరుగుతోన్న అవసరాలకు, ఖర్చులకు అనుగుణంగా ఆదాయం పెరగాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఉద్యోగంలో ఇలా భారీ ఆదాయాన్ని ఆర్జించడం అంత సులభమైన విషయం కాదు. అందుకే చాలా మంది వ్యాపారాన్ని ప్రారంభిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వ్యాపారంలో నష్టాలు వస్తాయని, పెట్టుబడికి భయపడి వ్యాపారం చేయడానికి వెనకడుగు వేస్తుంటారు. అలాగే వ్యాపారం అనగానే కేవలం పట్టణాల్లో సాధ్యమవుతుందని అనుకుంటారు.

కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూనే చేసుకునే వ్యాపారాలు కూడా ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో, నష్టాలు ఉండని వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి బెస్ట్‌ వ్యాపారాల్లో పౌల్ట్రీ ఫామ్‌ ఒకటి. కాలంతో సంబంధం లేకుండా నాన్‌ వెజ్‌ ప్రియులు ఎంతో ఇష్టంగా చికెన్‌ తింటుంటారు. అందుకే పౌల్ట్రీ ఫామ్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి లాభాలను ఆర్జించవచ్చు. ఇక కొనుగోలు దారులు సైతం నేరుగా ఫామ్‌కి వచ్చి కోళ్లను కొనుగోలు చేస్తుంటారు. కాబట్టి ట్రాన్స్‌పోర్టేషన్‌ ఖర్చులు సైతం భరించాల్సిన అవసరం ఉండదు. ఇంతకీ పౌల్ట్రీ ఫామ్‌ను ఎలా ప్రారంభించాలి.? ఎంత ఖర్చవుతుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పౌల్ట్రీ ఫామ్‌ ఏర్పాటుకు కొంత స్థలం అవసరపడుతుంది. అలాగే రేకుల షెడ్డు ఉండాలి. ఇక ప్రారంభంలో ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు కనీస పెట్టుబడి రూ. 2 లక్షల నుంచి మొదలు పెట్టొచ్చు. ఇక ఈ వ్యాపారం ప్రారంభించేందుకు కోళ్ల జాతిని ఎంచుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లో పలు రకాల కోళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే కోళ్లకు అవసరమైన ఫీడ్‌ను కూడా కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. ఇక కోళ్ల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించే వారికి ప్రభుత్వాలు రుణాలు సైతం అందిస్తున్నాయి.

ఇక కోళ్ల పెంపకం ప్రారంభించిన తర్వాత వాటి అమ్మకానికి మార్కెటింగ్ వ్యూహాలు అనుసరించాల్సి ఉంటుంది. కోళ్లను అమ్మకానికి దగ్గర్లోని రెస్టారంట్లు, చికెన్‌ దుకాణాలతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారం వృద్ధి చెందిన దాని ప్రకారం మీరే స్వయంగా ఒక ఆటోను కొనుగోలు చేసి నేరుగా దుకాణాలకు సప్లై చేయొచ్చు. దీనిద్వారా మరింత ఎక్కువ ఆదాయం పొందొచ్చు. ఇక లాభాల విషయానికొస్తే పౌల్ట్రీ ఫామ్‌తో సుమారు నెలకు రూ. లక్ష వరకు ఆర్జించే అవకాశం ఉంది. పౌల్ట్రీ ఫామ్‌ను ఏర్పాటు చేసేందుకు కొన్ని రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. పౌల్ట్రీ ఫామ్‌ను ఏర్పాటు చేయడానికి చలికాలం బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ సీజన్‌లో చికెన్‌ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..