Cash on Delivery Scam: క్యాష్‌ ఆన్‌ డెలివరీ చేస్తున్నారా..? జర భద్రం! సైబర్ నేరగాళ్ల సరికొత్త మోసం ఇదే..

|

Aug 30, 2023 | 7:36 AM

డిజిటల్ చెల్లింపులు పెరిగిన నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకి పెచ్చుమీరి పోతున్నాయి. సరికొత్త జిత్తులతో ప్రజలను మోసగిస్తున్నారు. తాజాగా ఈ-కామర్స్‌లో కొత్తరకం మోసం వెలుగుచూసింది. తరచుగా ఆన్ లైన్ షాపింగ్ చేసే వివిధ ఈ కామర్స్ కంపెనీల నుంచి డేటా చోరీ చేసి వినియోగదారులకు నకిలీ వస్తువులు అంటగడుతున్నారు. సైబర్ మోసగాళ్ల..

Cash on Delivery Scam: క్యాష్‌ ఆన్‌ డెలివరీ చేస్తున్నారా..? జర భద్రం! సైబర్ నేరగాళ్ల సరికొత్త మోసం ఇదే..
Online Shopping
Follow us on

బెంగళూరు, ఆగస్టు: డిజిటల్ చెల్లింపులు పెరిగిన నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకి పెచ్చుమీరి పోతున్నాయి. సరికొత్త జిత్తులతో ప్రజలను మోసగిస్తున్నారు. తాజాగా ఈ-కామర్స్‌లో కొత్తరకం మోసం వెలుగుచూసింది. తరచుగా ఆన్ లైన్ షాపింగ్ చేసే వివిధ ఈ కామర్స్ కంపెనీల నుంచి డేటా చోరీ చేసి వినియోగదారులకు నకిలీ వస్తువులు అంటగడుతున్నారు. సైబర్ మోసగాళ్ల నయామోసాలను తాజాగా బెంగళూరు పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఈ వ్యవహారంలో దాదాపు 21 మందితో కూడిన అంతర రాష్ట్ర ముఠాను అరెస్టు చేసి జైలుకు తరలించారు. వివరాల్లోకెళ్తే..

సాధారణంగా బడా ఈ కామర్స్‌ కంపెనీలు పలురకాల వస్తువులను అవుట్‌సోర్సింగ్‌ కంపెనీలకు విక్రయిస్తుంటాయి. ఐతే ఇందుకు సంబంధించిన డేటాను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం చేయకూడదనే నిబంధన కూడా అమలులో ఉంది. ఐతే ఆయా కంపెనీల్లో పనిచేసే కొందరు ఈ విధమైన మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ మోసగాళ్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని కంపెనీలోని వినియోగదారులకు సంబంధించిన డేటాను అక్రమంగా విక్రయిస్తున్నారు. ఇలా ఈ-కామర్స్‌ కంపెనీల నుంచి సేకరించిన డేటాతో క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆర్డర్ల డేటాను సైబర్ మోసగాళ్లు వేరుపరుస్తారు. అనంతరం వారు ఆర్డర్‌ చేసిన వస్తువులకు బదులు నకిలీ వస్తువులను వినియోగదారులకు డెలివరీ చేసి సొమ్ము కాజేస్తున్నారు. వినియోగదారులు ఆర్డర్‌ చేసిన తేదీ కన్నా ముందుగానే వారి అడ్రస్‌కు నకిలీ వస్తువులు పంపించడం వీరి ప్రత్యేకత. ఏ మాత్రం వినియోగదారులకు అనుమానం రాకుండా సొమ్ముచేసుకుంటున్నారు. అనంతరం తమకు వచ్చిన పార్సిల్ లోని వస్తువులు నకిలీవని గ్రహించిన వినియోగదారులు సంబంధిత ఈ-కామర్స్‌ కంపెనీలకు రిటర్న్‌ చేసేవారు. ఫలితంగా ఆ కంపెనీలు నష్టాలను చవిచూడాల్సొస్తోంది.

యేటా నకిలీ వస్తువుల వల్ల తమకు లక్షల్లో నష్టం వస్తుందని కంపెనీలు వాపోతున్నాయి. 2021 జూన్‌ నుంచి దాదాపు రూ.70 లక్షల నష్టం వాటిల్లిందని ఓ బడా కంపెనీ ఫిర్యాదు చేసయడంతో ఈ గరానా మోసం వెలుగుచూసింది.

ఇవి కూడా చదవండి

కేసు ఛేదించిన విధానం ఇదీ..

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొరియర్‌ సబ్‌-షిప్పింగ్‌ కంపెనీ సమాచారం, నిందితులు కస్టమర్లకు పంపిన నకిలీ షిప్‌మెంట్‌ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కేవైసీ, బ్యాంక్‌ ఖాతా సమాచారాన్ని సేకరించి వాటి ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ముంబయి, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన దాదాపు 21 మందితో కూడిన అంతరాష్ట్ర మూఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 26.95 లక్షలు నగదు, 11 మొబైల్‌ ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన కేసు దర్యాప్తులో ఉందని, పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని డీసీపీ శివప్రకాశ్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.