Best Scheme: కోటీశ్వరులు కాలంటే రెండు బెస్ట్‌ స్కీమ్స్‌.. ఇందులో ఏది బెటర్‌!

|

Dec 15, 2024 | 4:04 PM

Best Scheme: మంచి రాబడి పొందేందుకు రకరకాల స్కీమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. మీరు కోటీశ్వరులు కావాలంటే ఎన్నో పథకాలు ఉన్నాయి. వాటిలో ఇన్వెస్ట్‌ చేసినట్లయితే మంచి బెనిఫిట్‌ పొందవచ్చు. అలాంటి పథకాల గురించి తెలుసుకుందాం..

Best Scheme: కోటీశ్వరులు కాలంటే రెండు బెస్ట్‌ స్కీమ్స్‌.. ఇందులో ఏది బెటర్‌!
Follow us on

Best Scheme: సరైన పెట్టుబడి ఎంపికను ఎంచుకోవడం సామాన్యుడికి ఎప్పుడూ సవాలుతో కూడుకున్న పని. ముఖ్యంగా ఎన్‌పిఎస్ వాత్సల్య యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) విషయానికి వస్తే పెట్టుబడిదారులలో గందరగోళం మరింత పెరుగుతుంది. రెండు పథకాలు దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టే అవకాశాన్ని అందిస్తాయి. రాబడులకు హామీ ఇస్తున్నాయి. అయితే ఏది ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుందో తెలుసుకుందాం.

NPS వాత్సల్య యోజనలో పెట్టుబడి, రాబడి

మీరు ఎన్‌పిఎస్ వాత్సల్య యోజనలో ఏటా రూ. 10,000 ఇన్వెస్ట్ చేయాలి. ఇలా 18 ఏళ్లపాటు ఈ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మొత్తం రూ. 5 లక్షలు డిపాజిట్ అవుతుంది. ఈ పెట్టుబడి సంవత్సరానికి సగటున 10% రాబడిని ఇస్తుంది. 60 సంవత్సరాల వయస్సు వరకు ఈ ఫండ్ నుండి ఎటువంటి ఉపసంహరణ చేయకపోతే, మీ మొత్తం ఫండ్ రూ. 2.75 కోట్లకు చేరుకుంటుంది.

ఇవి కూడా చదవండి

అయితే, ఫండ్ మొత్తం రూ. 2.5 లక్షల కంటే తక్కువగా ఉంటే, పూర్తిగా ఉపసంహరణకు అనుమతి ఉంది. కానీ రూ.2.5 లక్షలు దాటితే అందులో 20% మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. యాన్యుటీని మిగిలిన 80% మొత్తం నుండి కొనుగోలు చేయాలి. తద్వారా పెన్షన్ ప్రయోజనాలు 60 సంవత్సరాల తర్వాత కొనసాగుతాయి.

పీపీఎఫ్‌ పథకంలో పెట్టుబడి, రాబడి

మరోవైపు పోస్టాఫీసు లేదా బ్యాంకులో పీపీఎఫ్ ఖాతా తెరిచి అందులో ఏటా రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 25 ఏళ్ల తర్వాత మొత్తం డిపాజిట్ దాదాపు రూ.1.03 కోట్లు అవుతుంది. పీపీఎఫ్‌ ప్రస్తుతం 7.1% వార్షిక వడ్డీని అందిస్తోంది. ఇది సురక్షితమైన, స్థిరమైన రాబడిని అందించే పథకం.

ఏ ప్లాన్ మంచిది?

లక్షాధికారి కావడమే లక్ష్యం, మీకు ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టడానికి సమయం ఉంటే NPS వాత్సల్య యోజన మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. 10% ఆశించిన రాబడితో ఇది పీపీఎఫ్‌తో పోలిస్తే ఎక్కువ నిధులను నిర్మించడంలో మీకు సహాయపడుతుంది. NPS ఉపసంహరణ పరిస్థితులు, ఫండ్ లాక్-ఇన్ వ్యవధి దీనిని తక్కువ లిక్విడిటీ పథకంగా మారుస్తాయి.

అదే సమయంలో పీపీఎఫ్‌ సురక్షితమైన, స్థిరమైన ఎంపిక. తక్కువ రిస్క్ తీసుకోవాలనుకునే వారికి ఇది మంచిది. దాని రాబడి ఎన్‌పీఎస్‌ కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఇది పన్ను ఆదా, నష్టభయం లేని పెట్టుబడికి అనుకూలంగా ఉంటుంది. మీ పెట్టుబడి వ్యూహం మీ అవసరం, రిస్క్ పై ఆధారపడి ఉంటుంది. మీరు అధిక రాబడిని పొందాలనుకుంటే, ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టగలిగితే ఎన్‌పీఎస్‌ వాత్సల్య యోజన సరైన ఎంపిక. మీకు భద్రత, స్థిరత్వం కావాలంటే పీపీఎఫ్‌ స్కీమ్‌ మంచి ఆప్షన్‌.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి