Bank Holidays: జూలైలో 15 రోజులు బ్యాంకులు బంద్… బ్యాంకులు ఎప్పుడెప్పుడు పనిచేయవంటే..
బ్యాంకు పనులను వాయిదా వేస్తూ వస్తున్నారా ? అయితే అలర్ట్.. జూలై నెలలో ఒకటి రెండు కాదు.. ఏకంగా 15 రోజులు బంద్ కానున్నాయి.
బ్యాంకు పనులను వాయిదా వేస్తూ వస్తున్నారా ? అయితే అలర్ట్.. జూలై నెలలో ఒకటి రెండు కాదు.. ఏకంగా 15 రోజులు బంద్ కానున్నాయి. అంటే నెలలో సగం రోజులు బ్యాంకులు పనిచేయవన్నమాట. అందుకే ఇప్పటి నుంచే బ్యాంక్ సెలవులు ఏ ఏ రోజున ఉన్నాయో చూసుకొని ఇప్పటి నుంచి బ్యాంక్ పనులను పూర్తి చేసుకోవడం మంచిది. అలాగే.. బ్యాంకులకు వెళ్లేముందు బ్యాంకుల సెలవులు చూసుకోవడం మంచిది. బ్యాంకుల సెలవులను ఆర్బీఐ జారీ చేస్తుంది. ఇందులో ఆయా రాష్ట్రాలను బట్టి సెలవులు మారుతుంటాయి.
జూలై నెలలో బ్యాంకులకు పండగ సెలవులు 9 రోజులు రానున్నాయి. ఇవి కాకుండా.. శనివారం, ఆదివారం సెలవులు 6 ఉంటాయి. మొత్తం 15 రోజులు సెలవులు ఉండనున్నాయి. అయితే ఈ 9 రోజుల పండగ సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి మారే అవకాశం లేకపోలేదు. కొన్ని రాష్ట్రాల్లో పండగ రోజున బ్యాంకులు మూసివేయబడవు.
బ్యాంకు సెలవులు.. 4 జూలై – ఆదివారం.. 10 జూలై – 2వ శనివారం.. 11 జూలై – ఆదివారం.. 12 జూలై – సోమవారం.. కాంగ్ (రాజస్థాన్), రథ యాత్ర (భువనేశ్వర్) 13 జూలై – మంగళవారం.. భాను జయంతి (జమ్ము కాశ్మీర్ అమరవీరుడు) 14 జూలై – ద్రుక్పా తేస్చీ 16 జూలై – గురువారం.. హారేల్ పూజా 17 జూలై – కార్చీ పూజా (అగర్తలా) 18 జూలై – ఆదివారం.. 19 జూలై – గురు రింపోచే యొక్క తుంగ్కర్ షెచు (గ్యాంగ్‌టాక్) 20 జూలై – మంగళవారం.. ఈద్ అల్ అధా (ఆల్ ఇండియా) 21 జూలై – బుధవారం.. బక్రీద్ 24 జూలై – 4వ శనివారం 25 జూలై – ఆదివారం 31 జూలై – శనివారం.. కెర్ పూజ(అగర్తలా) శని, ఆదివారాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.