Bank Holiday: 24 నుంచి వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. ఎందుకో తెలుసా?

|

Aug 23, 2024 | 3:27 PM

మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే రేపటి నుంచి అంటే శనివారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకు సెలవుల జాబితా నెల ప్రారంభం కంటే ముందే విడుదల చేస్తుంది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ). ఆగస్టు తొలినాళ్లలో కూడా చాలా రోజుల పాటు బ్యాంకులు మూతపడ్డాయి...

Bank Holiday: 24 నుంచి వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. ఎందుకో తెలుసా?
Bank Holiday
Follow us on

మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే రేపటి నుంచి అంటే శనివారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకు సెలవుల జాబితా నెల ప్రారంభం కంటే ముందే విడుదల చేస్తుంది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ). ఆగస్టు తొలినాళ్లలో కూడా చాలా రోజుల పాటు బ్యాంకులు మూతపడ్డాయి. అదే సమయంలో శనివారం నుండి వరుసగా 3 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే, ఈ కాలంలో, మీరు సాధారణ రోజుల మాదిరిగానే ఆన్‌లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను ఉపయోగించవచ్చు. వాటికి ఎలాంటి అంతరాయం ఉండదు.

నాల్గవ శనివారం కారణంగా ఆగస్టు 24న బ్యాంకులకు సెలవు ఉంది. ఆగస్టు 25న ఆదివారం, ఆగస్టు 26న సోమవారం జన్మాష్టమి కావడంతో బ్యాంకులు మూసి ఉండనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి. ఆగస్టు 24 నుంచి ఆగస్టు 26 వరకు బ్యాంకులకు వరుస సెలవులు ఉండటంతో వినియోగదారులు ముందస్తుగా గమనించి తమ బ్యాంకు పనులు చేసుకోవడం ఉత్తమం. ఇది కాకుండా ఆగస్టు 31వ తేదీ నాల్గవ శనివారం కావడంతో బ్యాంకులు మూసి ఉంటాయి.

బ్యాంకు మూసి ఉన్నప్పుడు ఏయే పనులు చేయవచ్చు?

ఇవి కూడా చదవండి

బ్యాంకుకు సెలవు ఉంటే, మీరు ఎవరి బ్యాంకు ఖాతాకు అయినా డబ్బు పంపవచ్చు. అంటే బ్యాంకులు మూసి ఉన్నా మీరు బ్యాంకింగ్ సేవల ద్వారా లావాదేవీలను పూర్తి చేయవచ్చు. ఇది కాకుండా, మీరు ATM మెషిన్ సహాయంతో డబ్బు తీసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, మీరు FD ఖాతాను తెరవాలనుకుంటే లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను తనిఖీ చేయాలనుకుంటే మీరు దీని కోసం బ్యాంకింగ్ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. అయితే, చెక్ లేదా డ్రాఫ్ట్ డిపాజిట్ చేయడం వంటి పని కోసం బ్యాంకులు ఓపెన్‌ అయ్యే వరకు వేచి ఉండాలి. మిగతా పనులు ఆన్‌లైన్‌ ద్వారా చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Google Search Tips: మీరు ఈ 3 విషయాలను గూగుల్‌లో సెర్చ్ చేస్తే జైలుకే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి