Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకులకు 18 రోజులు సెలవు.. ముందే ప్లాన్ చేసుకోండి.
ఇక దేశంలో బ్యాంకింగ్ సేవలు భారీగా విస్తరించాయి. ప్రభుత్వాలు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల్లో ఖాతాల్లోకి జమ చేసే ప్రస్తుత తరుణంలో ప్రతీ ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే బ్యాంకుల పనివేళలు, సెలవులపై ప్రతీ ఒక్కరూ దృష్టిసారిస్తున్నారు. ఏ రోజుల్లో బ్యాంకులు పనిచేయవో తెలుసుకొని, వాటి ఆధారంగా ప్లాన్ చేసుకుంటున్నారు...
Bank holidays in December 2023: నవంబర్ నెల ముగిసేందుకు ఇంకా రెండు రోజులే ఉంది. డిసెంబర్ నెలలో ఆర్థికపరమైన పలు అంశాల్లో కొన్ని మార్పులు జరగనున్నాయి. ఇక దేశంలో బ్యాంకింగ్ సేవలు భారీగా విస్తరించాయి. ప్రభుత్వాలు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల్లో ఖాతాల్లోకి జమ చేసే ప్రస్తుత తరుణంలో ప్రతీ ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే బ్యాంకుల పనివేళలు, సెలవులపై ప్రతీ ఒక్కరూ దృష్టిసారిస్తున్నారు. ఏ రోజుల్లో బ్యాంకులు పనిచేయవో తెలుసుకొని, వాటి ఆధారంగా ప్లాన్ చేసుకుంటున్నారు. మరి ఈ క్రమంలో డిసెంబర్ నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులు సెలవులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* ఇటానగర్, కోహిమాలోని బ్యాంకులు డిసెంబర్ 1వ తేదీన పనిచేయవు. ఇండిజీనియెస్ ఫెయిత్ డే సందర్భంగా డిసెంబర్ 1న బ్యాంక్ పనిచేయదు.
* ఇక డిసెంబర్ 4వ తేదీన పనాజీలో బ్యాంకులకు సెలవు. సెంట్ ఫ్రాన్సిస్ జెవియర్ ఫీస్ట్ సందర్భంగా అక్కడ బ్యాంకు పనిచేయదు.
* డిసెంబర్ 12వ తేదీ మంగళవారం.. పా-టోగన్ నెంజ్మింగ్ సాగ్మను పురస్కరించుకొని షిల్లాంగ్‌లోని బ్యాంక్‌లకు సెలవు ప్రకటించారు.
* ఇక డిసెంబర్ 13, 14 తేదీల్లో బుధవారం, గురువారం.. నాన్‌సూంగ్‌ను పురస్కరించుకొని గ్యాంగ్‌టక్‌లోని బ్యాంక్‌లకు సెలవు దినంగా ప్రకటించారు.
* డిసెంబర్ 18వ తేదీ సోమవారం.. షిల్లాంగ్‌లోని బ్యాంకులకు సోసో థామ్ వర్థంతి సందర్భంగా సెలవును ప్రకటించారు.
* డిసెంబర్ 19వ తేదీ మంగళవారం.. పనాజీలో గోవా లిబరేషన్ డేను పురస్కరించుకొని బ్యాంక్‌లు పనిచేయవు.
* డిసెంబర్ 25వ తేదీ సోమవారం రోజు క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
* ఇక డిసెంబర్ 26వ తేదీన మంగళవారం.. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుంకొని.. ఐజ్వాల్, కోహిమా, షిల్లాంగ్‌లోని బ్యాంక్‌లకు సెలవు ప్రకటించారు.
* క్రిస్మస్ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 27వ తేదీన బుధవారం.. కోహిమాలోని బ్యాంక్‌లకు సెలవు ప్రకటించారు.
* షిల్లాంగ్‌లోకి బ్యాంకులకు డిసెంబర్ 30వ తేదీ శనివారం.. యూ కయాంగ్ నాంగ్బాహ్ సందర్భంగా బ్యాంక్‌లకు సెలవు ప్రకటించారు.
ఇక వీటితో పాటు డిసెంబర్ 3వ తేదీ ఆదివారం, డిసెంబర్ 9 రెండో శనివారం, డిసెంబర్ 10 ఆదివారం, డిసెంబర్ 17 ఆదివారం, డిసెంబర్ 23వ తేదీ నాలుగో శనివారం, డిసెంబర్ 24వ తేదీ ఆదివారం. డిసెంబర్ 31వ తేదీ ఆదివారం బ్యాంకులు పనిచేయవు.
ఇదిలా ఉంటే బ్యాంకులకు సెలవులు ఉన్నా.. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు, ఏటీఎం సేవలు యధావిథిగా పనిచేస్తాయి. ఆన్‌లైన్ సేవల ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అలాగే ఏటీఎమ్‌ల ద్వారా క్యాష్ విత్‌డ్రాతో పాటు డిపాజిట్ మిషన్‌తో డిపాజిట్ కూడా చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..