SBI Safe Loan Tips: ప్రస్తుత కాలంలో సైబర్ మోసాలు సర్వసాధారణం అవుతున్నాయి. ఈజీ మనీ ఆకాంక్షతో కొందరు తమ జ్ఞానాన్ని, తెలివితేటలను ఉపయోగించి అమాయకులను నిలువునా దోచుకుంటున్నారు. ఈ మోసాలు ఇటీవలి కాలంలో మరింత ఎక్కవ అవుతున్నాయి. వీటిలో ఎక్కువ భాగం బ్యాంకింగ్ మోసాలేనని ఎస్‌బీఐ అధికారులు చెబుతున్నారు . ఈ నేపథ్యంలో.. లోన్ యాప్‌ల ఆఫర్లకు చిక్కుకుని.. మోసానికి గురికాకుండా ఉండేందుకు SBI కొన్ని నిర్దిష్ట భద్రతా చిట్కాలు ప్రకటించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.
ప్రజల అవసరాలను పసిగడుతున్న సైబర్ నేరగాళ్లు.. వారిని మోసగించి డబ్బులు గుంజడానికి అలవాటు పడ్డారు. ముఖ్యంగా లోన్ యాప్‌ల ద్వారా విపరీతమైన దోపిడీలు చేస్తున్నారు. ఫ్రీ లోన్స్ పేరుతో ప్రజల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు. అందుకే ప్రజలు ఇలాంటి విషయాల పట్ల నిత్యం అలర్ట్‌గా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రజలను అలర్ట్ చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రచారం ప్రారంభించింది. లోన్ అప్లికేషన్ స్కామ్‌లను నివారించడానికి 6 భద్రతా చిట్కాలను షేర్ చేసింది. స్మార్ట్ ఫోన్ ఆధారంగా లోన్స్ తీసుకునే సమయంలో ఈ అంశాలను గుర్తుంచుకోవాలని, తద్వారా మోసాల బారిన పడకుండా ఉండొచ్చని ఎస్‌బిఐ తెలిపింది.
“ఫేక్ లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోవాలి. మీ బ్యాంక్ ఖాతా వివరాలను ఇతరులకు షేర్ చేయొద్దు. సైబర్ నేరాలకు సంబంధించిన సమాచారాన్ని https://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయొచ్చు.’’ అని SBI ట్వీట్ చేసింది.
SBI షేర్ చేసిన 6 టిప్స్..
1. యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు ఆ యాప్ ప్రామాణికతను చెక్ చేయాలి.
2. ఎలాంటి అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేయవద్దు.
3. మీ డేటాను దొంగిలించే అనధికార యాప్‌లను అస్సలు ఉపయోగించొద్దు.
4. మీ డేటా చోరీకి గురికాలేదని నిర్ధారించుకోవడానికి యాప్ అనుమతి సెట్టింగ్‌లను చెక్ చేయాలి.
5. అనుమానాస్పద మనీ లెండింగ్ దరఖాస్తుల గురించి స్థానిక పోలీసు అధికారులకు తెలియాలి.
6. మీ అన్ని ఆర్థిక లావాదేవీలు, ఫిర్యాదుల కోసం https://bank.sbi వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు.
Please refrain from clicking on suspicious links or giving your information to a company posing as a Bank or Financial Company.
Report cybercrimes on – https://t.co/d3aWRrftOA#SBI #AmritMahotsav #SafetyTips #StaySafe #StayVigilant #CyberSafety #ThinkBeforeYouClick pic.twitter.com/9eFYc4VXcU
— State Bank of India (@TheOfficialSBI) July 23, 2022
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..