Bank Transaction Rules: మీ బ్యాంకు అకౌంట్‌ నుంచి డబ్బు విత్‌డ్రా చేస్తే పన్ను చెల్లించాలా?

|

Sep 22, 2024 | 3:12 PM

Bank Transaction Rules: మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బును ఎప్పుడైనా విత్‌డ్రా చేస్తున్నారంటే కొన్ని విషయాలు తెలుసుకోవడం ముఖ్యం.  మీరు ఉపసంహరణను మళ్లీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. తద్వారా మీరు అనవసరమైన పన్ను చెల్లించకుండా ఉండవచ్చు. దీని కోసం పన్ను చెల్లించకుండా సంవత్సరానికి ఎంత..

Bank Transaction Rules: మీ బ్యాంకు అకౌంట్‌ నుంచి డబ్బు విత్‌డ్రా చేస్తే పన్ను చెల్లించాలా?
Follow us on

Bank Transaction Rules: మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బును ఎప్పుడైనా విత్‌డ్రా చేస్తున్నారంటే కొన్ని విషయాలు తెలుసుకోవడం ముఖ్యం.  మీరు ఉపసంహరణను మళ్లీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. తద్వారా మీరు అనవసరమైన పన్ను చెల్లించకుండా ఉండవచ్చు. దీని కోసం పన్ను చెల్లించకుండా సంవత్సరానికి ఎంత మొత్తాన్ని విత్‌డ్రా చేయవచ్చో తెలుసుకోవాలి. నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ డబ్బు తీసుకున్నందుకు రుసుము చెల్లించాలనే నియమం ఏటీఎం లావాదేవీలకు మాత్రమే కాకుండా బ్యాంకు నుండి డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది.

ఎంత నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు:

తమ బ్యాంకు ఖాతా నుంచి ఎంత నగదు కావాలంటే అంత ఉచితంగా తీసుకోవచ్చని ప్రజలు భావిస్తున్నారు. కానీ, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194N ప్రకారం.. ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే, అప్పుడు అతను టీడీఎస్‌ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ నియమం వరుసగా 3 సంవత్సరాలుగా ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయని వారికి మాత్రమే. అలాంటి వారు ఏదైనా బ్యాంకు, కోఆపరేటివ్ లేదా పోస్టాఫీసు నుంచి రూ.20 లక్షల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే వారికి ఉపశమనం:

ఐటీఆర్ ఫైల్ చేసే వారికి ఈ రూల్ కింద మరింత ఉపశమనం లభిస్తుంది. అటువంటి ఖాతాదారులు టీడీఎస్‌ చెల్లించకుండానే వారి బ్యాంకు, పోస్టాఫీసు లేదా సహకార బ్యాంకు ఖాతా నుండి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1 కోటి వరకు నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు.

టీడీఎస్‌ ఎంత చెల్లించాల్సి ఉంటుంది:

ఈ నియమం ప్రకారం, మీరు మీ బ్యాంక్ ఖాతా నుండి రూ. 1 కోటి కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే టీడీఎస్‌ 2 శాతం చొప్పున కట్‌ అవుతుంది. మీరు గత మూడు సంవత్సరాలుగా నిరంతరంగా ఐటీఆర్‌ ఫైల్ చేయకుంటే, మీరు రూ. 20 లక్షల కంటే ఎక్కువ నగదు ఉపసంహరణపై 2 శాతం టీడీఎస్‌, రూ. 1 కోటి కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే 5 శాతం టీడీఎస్‌ చెల్లించాలి.

ఏటీఎం లావాదేవీలపై ఇప్పటికే ఛార్జీ:

ఏటీఎం నుండి నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ డబ్బు తీసుకున్నందుకు బ్యాంకులు రుసుము వసూలు చేస్తాయి. జనవరి 1, 2022 నుండి ఏటీఎం నుండి నగదు విత్‌డ్రా చేసుకునేందుకు సర్వీస్ ఛార్జీని ఆర్బీఐ పెంచింది. ఇప్పుడు బ్యాంకులు నిర్ణీత పరిమితిని మించిన లావాదేవీలకు రూ.21 వసూలు చేస్తున్నాయి. గతంలో దీని కోసం రూ.20 చెల్లించాల్సి వచ్చేది. చాలా బ్యాంకులు తమ ఏటీఎంల నుండి ప్రతి నెలా ఐదు లావాదేవీలను ఉచితంగా అందిస్తాయి. అలాగే, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి మూడు లావాదేవీలు ఉచితం. అయితే, మెట్రో నగరాల్లో మీరు మీ స్వంత బ్యాంకు నుండి మూడు సార్లు మాత్రమే ఉచితంగా డబ్బు తీసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి