Bank Loan: ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (IOB) రుణాలు నేటి నుంచి ఖరీదైనవి కానున్నాయి. IOB రెపో ఆధారిత రుణ రేటు ఈ రోజు నుండి అంటే మే 10 నుండి 7.25 శాతానికి పెరిగింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు రెపో లింక్డ్ లెండింగ్ రేటు (RLLR)ని 7.25 శాతానికి సవరించాయి. అంతకుముందు రోజు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కెనరా బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కరూర్ వైశ్యా బ్యాంక్ కూడా తమ రుణ రేట్లను పెంచాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గత వారం పాలసీ రేటును 0.40 శాతం నుంచి 4.40 శాతానికి పెంచింది. దీని తర్వాత చాలా బ్యాంకులు తమ రుణాలను ఖరీదైనవిగా మార్చాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ RLLR 4.40% + 2.85 % = 7.25%గా మారింది. RLLR పెరుగుదలతో, గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు సహా అన్ని రకాల రుణాలు మరింత ఖరీదైనవిగా మారతాయి. కస్టమర్లు ఎక్కువ మొత్తంలో ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది.
PNB రుణం కూడా ఖరీదైనది:
ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) రెపో లింక్డ్ లెండింగ్ రేటును 0.40 శాతం పెంచింది. రుణ రేటు 6.50 శాతం నుంచి 6.9 శాతానికి పెరిగింది. జూన్ 1 నుంచి కొత్త రేట్లు వర్తిస్తాయి. ప్రస్తుత కస్టమర్లకు కొత్త రేట్లు వర్తిస్తాయి. RLLR కొత్త రేట్లు మే 7 నుండి అమలులోకి వచ్చాయి. మీ EMI పెరుగుతుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సోమవారం మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ (ఎంసిఎల్‌ఆర్)ని 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇది అన్ని రకాల రుణాలపై ప్రభావం చూపుతుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నుండి రుణం తీసుకున్న వారి ప్రస్తుత ఇఎంఐ పెరుగుతుంది. MCLR అనేది బ్యాంకు వడ్డీ రేటు ఆధారంగా నిర్ణయించబడే వడ్డీ రేటు. ఏ రుణానికైనా వడ్డీ రేటు అంతకంటే తక్కువ ఉండకూడదు.
కెనరా బ్యాంక్ రెపో లింక్డ్ లెండింగ్ రేటు (RLLR)ని 7.30 శాతానికి పెంచింది. బ్యాంక్ MCLR ఆధారిత రుణ రేట్లను కూడా మార్చింది. దీనిలో ఒక సంవత్సరం రేటు 7.35 శాతం. ఒక రోజు నుండి ఆరు నెలల వరకు MCLR 6.65 నుండి 7.30 శాతం పరిధిలో ఉంటుంది. కొత్త రేట్లు మే 7, 2022 నుండి అమలులోకి వచ్చాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లు పెంపు:
రెపో రేటు పెంపుతో, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లు కూడా పెరుగుతాయి. వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. కోటక్ బ్యాంక్ FD రేట్లను పెంచడం ద్వారా కస్టమర్లకు ఉపశమనం కలిగించింది. రిటైల్ కస్టమర్ల కోసం వివిధ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రేట్లు పెంచాయి. కొత్త రేట్లు మే 6 నుండి అమల్లోకి వచ్చాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి