Bank Holidays November 2021: కస్టమర్లకు అలర్ట్‌.. నవంబర్‌ నెలలో బ్యాంకులకు 17 రోజులు సెలవులు..!

Bank Holidays November 2021: బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించిన లావాదేవీల విషయాలలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉంటుంది. వివిధ రకాల లావాదేవీలు,..

Bank Holidays November 2021: కస్టమర్లకు అలర్ట్‌.. నవంబర్‌ నెలలో బ్యాంకులకు 17 రోజులు సెలవులు..!
Bank Holiday

Updated on: Oct 26, 2021 | 7:03 AM

Bank Holidays November 2021: బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించిన లావాదేవీల విషయాలలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉంటుంది. వివిధ రకాల లావాదేవీలు, ఇతర పనుల గురించి బ్యాంకులకు వెళ్తుంటారు. అయితే బ్యాంకులకు ఉండే సెలవుల గురించి ముందే తెలుసుకుంటే సమయం వృథా కాకుండా ఉంటుంది. ఇప్పుడు అక్టోబర్‌ నెల ముగియబోతోంది. ఇక నవంబర్‌ నెల ప్రారంభం ముందు చాలా మంది బ్యాంకుల గురించి తెలుసుకుంటారు. ఇక సోషల్ మీడియాలో కూడా బ్యాంకు సెలవుల గురించి ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. అయితే నవంబర్ లో బ్యాంకుల సెలవుల గురించి కూడా సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్‌ అవుతోంది. నవంబర్ 17 రోజులపాటు బ్యాంకులు పనిచేయవన్నది ఈ పోస్టు సారాంశం. అయితే 17 రోజుపాటు బ్యాంకులు పనిచేయని మాట వాస్తవమే.. కానీ ఆ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కలుపుకొని ఈ సెలువులు ఉన్నాయి.

అయితే వచ్చేనెలలో కన్నడ రాజ్యజోత్సవం, ఛత్‌ పూజా వంటి పండుగలు ఉన్నాయి. వీటికి కర్ణాటకలో మాత్రమే హాలీడే ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లో బ్యాంకులు యధావిధిగా పని చేస్తుంటాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. దీపావళి, గురునానక్‌ జయంతి/ కార్తిక పూర్ణిమ సందర్భంగా రెండు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. సాధారణ సెలవులు (శని, ఆదివారాలు)తో కలుపుకొని మొత్తంగా 8 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. కాబట్టి ఆయా తేదీలను బట్టి మీ బ్యాంకు పనులను చేసుకోవడం బెటర్‌.

తెలుగు రాష్ట్రాల్లో ఈ తేదీల్లో బ్యాంకులకు సెలువులు..

అయితే నవంబర్‌ నెలలో బ్యాంకులకు 17 సెలువులు ఉన్నాయి. అయితే ఆ సెలవులు అన్ని రాష్ట్రాలకూ వర్తించవు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. నవంబర్‌ 4 దీపావళి, 7వ తేదీ ఆదివారం, 13వ తేదీ రెండో శనివారం, 14న ఆదివారం, 19న గురునానక్‌ జయంతి, కార్తిక పూర్ణిమ, 27న నాలుగో శనివారం, 28 ఆదివారం రోజుల్లో బ్యాంకులు పని చేయవు. వీటిని దృష్టిలో ఉంచుకుని బ్యాంకుకు సంబంధించిన పనుల విషయాలలో ప్లాన్‌ చేసుకోవడం బెటర్‌.

ఇవీ కూడా చదవండి:

Gold Price Today: పండగ సీజన్‌లో బంగారం ధరలు పైపైకి.. 10 గ్రాముల పసిడి ధర ఎంతంటే..

Online Money Fraud: ఆన్‌లైన్‌లో డబ్బులు కోల్పోయారా?.. అయితే ఇలా చేయండి.. మీ డబ్బు వెనక్కి పొందండి..!