
జూన్ నెలలో మీకు బ్యాంకు సంబంధిత పని ఉంటే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. చాలా మంది ప్రతి రోజు బ్యాంకుల పని నిమిత్తం వెళ్తుంటారు. అలాంటి వారు నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మే నెల ముగియనుంది. జూన్ 2025లో భారతదేశంలోని బ్యాంకులు మొత్తం 12 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. ఇందులో జాతీయ, ప్రాంతీయ పండుగలు అలాగే సాధారణ వారపు సెలవులు కూడా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించిన ఈ సెలవుల జాబితా ప్రకారం, బ్యాంకు కస్టమర్లు తమ ఆర్థిక పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు
ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఆయా రాష్ట్రాల పండగలు, వివిధ కార్యక్రమాలను బట్టి ఉంటాయని గుర్తించుకోండి. అందుకే కస్టమర్లు తమ తమ రాష్ట్రాల బ్యాంకు సెలవుల జాబితాను తనిఖీ చేయాలని సూచించారు. బక్రీద్ కారణంగా జూన్ 6 (శుక్రవారం) కేరళలోని కొచ్చి, తిరువనంతపురంలో సెలవు ఉంటుంది. జూన్ 7 (శనివారం) బక్రీద్ కారణంగా దేశవ్యాప్తంగా (కొన్ని రాష్ట్రాలు మినహా) బ్యాంకులు మూసి ఉంటాయి. దీని తరువాత జూన్ 8 (ఆదివారం) వారపు సెలవు ఉంటుంది. అంటే ఈ నగరాల్లో 3 రోజుల సుదీర్ఘ వారాంతపు సెలవులు ఉండవచ్చు.
బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ UPI, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ATMలు వంటి డిజిటల్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా పనిచేస్తాయి. అయితే, చెక్కు క్లియరెన్స్, డిమాండ్ డ్రాఫ్ట్, పాస్‌బుక్ అప్‌డేట్‌లు వంటి కొన్ని సేవలు బ్యాంకు శాఖల ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. అందుకే ఈ పనులను సకాలంలో పూర్తి చేయడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి