
బ్యాంకింగ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. బ్యాంకులు ఈ నెలలో వరుసగా మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు రావడంతో్ వరుసగా మూడు రోజులు దేశంలోని బ్యాంకులన్నీ బంద్ కానున్నాయి. వినాయక చవితి పండుగ త్వరలో రానుంది. ఈ నెల 14వ తేదీన గణేశ్ చుతుర్ది వస్తోంది. ఈ సందర్భంగా వరుస సెలవు కారణంగా బ్యాంకులు మూడు రోజులు క్లోజ్ కానున్నాయి. దీంతో బ్యాంకింగ్ ఖాతాదారులు ముందుగానే అప్రమత్తమై తమ లావాదేవీలను నిర్వహించుకోవాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఏయే తేదీల్లో బ్యాంకులు మతపడనున్నాయనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సెప్టెంబర్ 12వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు ఉండవు. సెప్టెంబర్ 12వ తేదీన రెండో శనివారం వస్తోంది. ప్రతీ నెలా రెండో శనివారం బ్యాంకులకు సాధారణ సెలవుదినం కావడంతో ఆ రోజు మూతపడతాయి. ఇక సెప్టెంబర్ 13వ తేదీన ఆదివారం వస్తుండటంతో బ్యాంకులకు సాధారణ సెలవు రోజుగా చెప్పవచ్చు. ఇక సెస్టెంబర్ 14వ తేదీన గణేశ్ చతుర్ది వస్తుండటంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు ఆ రోజు ఉండవు. దీంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. ఈ రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్, షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులన్నీ మూతపడతాయి. ఖాతాదారులు ఈ విషయాన్ని ముందుగానే గమనించాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.
సెప్టెంబర్ 4వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి రావడంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులు ఉండవు. తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్యాంక్ శాఖలు పనిచేయవు. ఇక అహ్మదాబాద్, ఐజ్వాల్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, , జైపూర్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, రాంచీ, కోల్‌కతా, లక్కాపూర్, భోపాల్. సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురంలో బ్యాంకులు మూతపడనున్నాయి. సెప్టెంబర్ 6వ తేదీన ఆదివారం రావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు.
సెలవు రోజుల్లో కేవలం బ్రాంచ్ సంబంధిత కార్యకలాపాలు మాత్రమే నిలిచిపోతాయి. బ్యాంక్ ఆన్‌లైన్ సేవలన్నీ యథావిధిగా పనిచేస్తాయి. దీంతో మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం సేవల ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఈ సేవలు నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. దీంతో వీటి ద్వారా నగదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. బ్యాంక్ బ్రాంచ్‌లు మూసివేసినా పెద్దగా ప్రభావం ఉండదు. సంవత్సరం పొడవునా ఎప్పుడైనా డిజిటల్ ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు.