Bank Holiday: సెలవు లేకపోయినా ఏప్రిల్ 1న బ్యాంకులను ఎందుకు బంద్ చేస్తారో తెలుసా..? అసలు కథ ఇదే..

Bank Holiday on 1st April: భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు మినహా ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏప్రిల్ 1న బంద్ ఉంటాయి. ఇది ఎప్పటినుంచో వస్తోంది. దీనిలో భాగంగా ఏప్రిల్ 1న వచ్చే శనివారం బ్యాంకులను మూసివేయనున్నారు.

Bank Holiday: సెలవు లేకపోయినా ఏప్రిల్ 1న బ్యాంకులను ఎందుకు బంద్ చేస్తారో తెలుసా..? అసలు కథ ఇదే..
Bank Holidays

Updated on: Mar 26, 2023 | 12:49 PM

Bank Holiday on 1st April: భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు మినహా ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏప్రిల్ 1న బంద్ ఉంటాయి. ఇది ఎప్పటినుంచో వస్తోంది. దీనిలో భాగంగా ఏప్రిల్ 1న వచ్చే శనివారం బ్యాంకులను మూసివేయనున్నారు. అయితే ఏప్రిల్ 1వ తేదీన బ్యాంకులను ఎందుకు మూసివేస్తారు అనే విషయం మీకు తెలుసా..? తెలియకపోతే ఈ విషయాలను తెలుసుకోండి.. వాస్తవానికి ప్రతి సంవత్సరం బ్యాంక్ ఉద్యోగుల కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్వారా నోటిఫైడ్ బ్యాంకుల ఖాతాలను వార్షికంగా క్లోజ్ చేయడమే దీనికి కారణం.. ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. నూతన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగులు మార్చి 31న ఆర్థిక పనిని పూర్తి చేసే బాధ్యతను కలిగి ఉంటారు. ఈ సమయంలో బ్యాంకు ఉద్యోగులు కూడా ఎక్కువ గంటలు పని చేస్తారు. దీని కారణంగా కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజు ఏప్రిల్ 1న బ్యాంక్ మూసివేస్తారు. యాన్యూవల్ క్లోజింగ్ రోజుగా దీనిని పరిగణిస్తూ.. బ్యాంకులు ఆ రోజున సెలవు ఇస్తాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం బ్యాంకులు తెరిచిఉంటాయి.

15 రోజులు బ్యాంకులకు సెలవులు..

ఏప్రిల్ నెలలో చాలా రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఏప్రిల్ 2023లో బ్యాంక్ మూసివేతతో సహా 15 రోజుల పాటు బ్యాంకులు మూసివేయనున్నారు. ఇందులో ప్రాంతీయ సెలవులతో పాటు ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు కూడా ఉంటాయి. ఏప్రిల్ నెలలో బ్యాంక్ వార్షిక ఖాతా ముగింపు, మహావీర్ జయంతి, బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు, గుడ్ ఫ్రైడే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, సంక్రాంతి/బిజూ ఫెస్టివల్/బిసు ఫెస్టివల్, తమిళ న్యూ ఇయర్ డే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఇది కాకుండా, బెంగాలీ నూతన సంవత్సర దినోత్సవం (నబ్బర్షా), జుమాత్-ఉల్-విదా, ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్ ఈద్) / గరియా పూజ / సందర్భంగా కూడా బ్యాంకులను మూసివేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..