చాలా మందికి ప్రతి రోజు ఏదో ఒక విధంగా బ్యాంకు పనులు ఉండటం సాధారణం. ముఖ్యంగా వ్యాపారవేత్తలు, ఇతరులకు బ్యాంకు పనులు తప్పకుండా ఉంటాయి. అలాంటి వారు బ్యాంకులు ఏయే రోజుల్లో మూసి ఉంటాయోనన్న విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. జూలై నెలలో 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్న విషయం తెలిసిందే. అయితే ఈనెలలో నాలుగు రోజులు గడిచినపోయాయి. అయితే జూలై 5 గురు హరగోవింద్ జీ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సెలవుదినం కొనసాగడం లేదు. ఈ జన్మదిన వేడుకలు జరుపుకునే రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులు మూతపడతాయి. ఆర్బీఐ జాబితా ప్రకారం, జమ్మూతో పాటు శ్రీనగర్‌లో రేపు బ్యాంకులు మూసివేయబడతాయి. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ జన్మదిన వేడుకలు జరుపుకోనున్నాయి. ఆ రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులు మూసి ఉంటాయని గుర్తించుకోండి.
వచ్చే వారం నాలుగు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. సోమవారం, మంగళవారం, జూలై 8, జూలై 9 తేదీలలో చాలా రాష్ట్రాల్లో బ్యాంక్ మూసివేసి ఉండనున్నాయి. ఇది కాకుండా, వచ్చే వారం శని, ఆదివారం బ్యాంకులు మూసి ఉంటాయి. అంటే వచ్చే వారం ఏడింటికి నాలుగు రోజులు బ్యాంకులు మూత పడబోతున్నాయి. వచ్చే వారం ఏ స్టేట్స్ బ్యాంకులు మూసివేయబడతాయో తెలుసుకుందాం.
జూలై 2024లో బ్యాంకు సెలవుల జాబితా – రాష్ట్రాల ప్రకారం..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి