
బ్యాంకింగ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ఆగస్ట్ 26వ తేదీన బ్యాంకులు మూతపడనున్నాయి. ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం మిలాద్-ఉన్-నబీ సందర్భంగా తెలంగాణలో బుధవారం బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇక తెలంగాణతో పాటు రేపు మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు ఉత్తరాఖండ్, మణిపూర్, జమ్మూ కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, కేరళలో కూడా బ్యాంకులు మూతపడనున్నాయి. అలాగే ఢిల్లీ, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో కూడా క్లోజ్ కానున్నాయి. మిలాద్-ఉన్-నబీ పండుగ సందర్భంగా చాలా రాష్ట్రాల్లో ఆగస్ట్ 26న బ్యాంకులు ఉండవని చెప్పవచ్చు. ఇక తిరువోణం సందర్భంగా కేరళలో కూడా బ్యాంకులు సెలవు పాటించనున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఆగస్ట్ 25న బ్యాంకులు మూతపడ్డాయి. కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ బ్యాంకులు బంద్ అయ్యాయి. బుధవారం తెలంగాణలో బ్యాంకులు క్లోజ్ కానున్నాయని చెప్పవచ్చు. దీంతో తెలంగాణలోని బ్యాంక్ ఖాతాదారులు దీనిని గమనించాలి. బ్యాంక్ పనులు ఉంటే ఈ రోజే పూర్తి చేసుకోవాలి. రేపు బ్యాంకులు మూతపడనుండగా.. ఆగస్ట్ 27న మళ్లీ తెరుచుకుంటాయి. అనంతరం ఆగస్టు 28న శుక్రవారం రాక్షాబంధన్ సందర్భంగా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు ఉండవు. ఆ తర్వాత ఆగస్టు 30న ఆదివారం సందర్భంగా బ్యాంకులు ఉండవు. ఈ వారంలో బ్యాంకులకు వరుస సెలవులు వస్తుండటంతో ఖాతాదారులు వీటి గురించి ముందే తెలుసుకుని జాగ్రత్త పడాలి.
సెప్టెంబర్‌లో కూడా బ్యాంకులు చాలా రోజుల పాటు మూసి ఉండనున్నాయి. కృష్ణాష్టమి, గణేష్ చతుర్దితో పాటు పలు పండుగలు వస్తున్న సందర్భంగా బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే సెలవు రోజుల్లో కేవలం బ్యాంక్ బ్రాంచ్ సంబంధిత కార్యకలాపాలు మాత్రమే నిలిచిపోతాయి. ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు ద్వారా లావాదేవీలు యథావిధిగా నిర్వహించుకోవచ్చు. అయితే ప్రాంతీయ సెలవులు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మీరు బ్రాంచ్‌ను సందర్శించాలని అనుకుంటే ముందే తనిఖీ చేసుకోవడం మంచిది. ఒకసారి వెళ్ళేముందు బ్యాంక్ సిబ్బందిని సంప్రదించండి. దీని వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సెలవు రోజుల్లో చెక్ బుక్కుల క్లియెరెన్స్, భౌతిక రుణ పత్రాలు సమర్పణ వంటి సేవలు అందుబాటులో ఉండవు. ఇక మీరు భౌతికంగా శాఖను సందర్శించాలని అనుకుంటే ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం బ్యాంకులు ఏయే రోజుల్లో ఉండవనేది ముందే తెలుసుకోవాలి. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పవచ్చు.