AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banks Holiday: రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్.. కస్టమర్లకు బిగ్ అలర్ట్..

బ్యాంకుల సెలవుల గురించి కస్టమర్లు అవగాహన కలిగి ఉండాలి. రాష్ట్రాన్ని బట్టి సెలవులు అనేవి మారుతూ ఉంటాయి. ఈ వారంలో రెండు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. మే 4 నుంచి మే 10వ తేదీ వరకు బ్యాంక్ సెలవుల గురించి చూద్దాం.

Banks Holiday: రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్.. కస్టమర్లకు బిగ్ అలర్ట్..
Bank Holiday
Venkatrao Lella
|

Updated on: May 04, 2026 | 9:57 AM

Share

బ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. ఈ వారంలో బ్యాంకులు రెండు రోజుల పాటు మూసి ఉండనున్నాయి. మే 4 నుంచి 10వ తేదీ మధ్య రెండు రోజుల పాటు బ్యాంకులు ఉండవు. దీంతో బ్యాంకు బ్రాంచులకు వెళ్లేవారు దీనిని గుర్తించి ప్లాన్ చేసుకోవడం మంచిది. ఈ రెండు రోజుల పాటు బ్రాంచ్ కార్యకలాపాలు నిలిచిపోతున్నాయి. దీంతో బ్రాంచ్ సంబంధిత పనులపై ప్రభావం పడనుంది. ఈ వారంలో బ్యాంక్ పనులను పూర్తి చేయాలనే ప్లాన్ చేస్తుంటే.. బ్యాంకులు ఏ రోజు మూసి ఉంటాయనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు ఏ రోజు మూసి ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

బ్యాంకులు ఎప్పుడెప్పుడు మూసి ఉంటాయి..?

ఆర్బీఐ నిబంధనల ప్రకారం మే 4వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు బ్యాంకులు రెండు రోజులు ఉండవు. మే 9వ తేదీన రవీంద్రనాథ్ టాగోర్ జయంతి సందర్భంగా కోల్‌కత్తాలో బ్యాంకులు మూసి ఉంటాయి. ఇక దేశవ్యాప్తంగా మిగతా ప్రాంతాల్లో తెరిచి ఉంటాయి. ఇక మే 10వ తేదీన ఆదివారం రావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు కావడంతో ఆ రోజు మూతపడతాయి.

మే నెలలో ఎన్ని సెలవులు

ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. మే నెలలో ఆరు రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా బ్యాంక్ సెలవులు ఒకేలా ఉండవు. స్థానిక పండుగలు, రాష్ట్రాల సెలవులను బట్టి మారుతూ ఉంటాయి. దీంతో వినియోగదారులు బ్యాంక్‌కు వెళ్లేటప్పుడు ఆర్బీఐ విడుదల చేసిన అధికారిక క్యాలెండర్‌ను చెక్ చేసుకోవడం మంచిది. బ్యాంకులు ప్రతీ నెలా రెండు, నాల్గొ శనివారాలతో పాటు ఆదివారం బంద్ అవుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సహా అన్ని బ్యాంకులకు ఇది వర్తిస్తుంది. అయితే బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా పనిచేస్తాయి. యూపీఐ, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు ఎప్పటిలాగే పనిచేస్తాయి. ఇక నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక ఏటీఎం సేవలు కూడా వర్క్ అవుతాయి. చెక్కుల క్లియరెన్స్ వంటి బ్రాంచ్ కార్యకలాపాలు మాత్రమే నిలిచిపోతాయి.

Follow Us