Bank Holiday Alert: కస్టమర్లకు అలర్ట్.. 5 రోజులు బ్యాంకులు బంద్.. ఈరోజుతోపాటు ఎప్పుడెప్పుడంటే..

|

Sep 05, 2021 | 9:15 AM

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. పని మీద బ్యాంకులకు వెళ్తున్నారా ? అయితే మీరు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే. ఈరోజు నుంచి దాదాపు

Bank Holiday Alert: కస్టమర్లకు అలర్ట్.. 5 రోజులు బ్యాంకులు బంద్.. ఈరోజుతోపాటు ఎప్పుడెప్పుడంటే..
Bank Holidays
Follow us on

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. పని మీద బ్యాంకులకు వెళ్తున్నారా ? అయితే మీరు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే. ఈరోజు నుంచి దాదాపు 5 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. అయితే ఈ ఐదు రోజులు బ్యాంకులు వరుసగా బంద్ కాదండోయ్.. వేరు వేరు రోజులలో ఈ వారంలో 5రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. అవి ఎప్పుడెప్పుడో తెలుసుకుందామా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ హాలీడే ప్రకారం ఈనెలలో మొత్తం 12 సెలవులు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఏదేమైనా బ్యాంక్ కస్టమర్లు వచ్చే వారంలో ఆదివారంతోపాటు.. శనివారం సహా వివిధ పండుగలకు కలిపి మొత్తం ఐదు బ్యాంకు సెలవులు ఉండనున్నాయి.

బ్యాంకు సెలవుల జాబితా ప్రకారం ఆదివారం, ప్రభుత్వ సెలవుదినం కావడంతో సెప్టెంబర్ 5న బ్యాంకులు బంద్ కానున్నాయి. సెప్టెంబర్ 8న గౌహతిలో ఎక్కువగా జరుపుకునే శ్రీమంత శంకరదేవ తిథి పండగలకు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 9న గ్యాంగ్ టక్‏లో జరుపుకునే తీజ్ హారితాళిక కోసం బ్యాంకులు పనిచేయవు. ఇక సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఈ రోజు అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగపూర్ పనాజీలలో బ్యాంకులు మూసివేయబడతాయి. సెప్టెంబర్ 11 న రెండవ శనివారం కారణంగా బ్యాంకులు పనిచేయవు. ఆర్బీఐ ప్రకారం సెలవులు రాష్ట్రాల వారిగా పండుగలు, ప్రత్యేక రోజులకు బ్యాంకులు పనిచేయవు.

 

అధికారిక సెలవుల దృష్ట్యా చూస్తే.. సెలవుల జాబితా ‘నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్’ కిందకు వస్తుంది. సెలవుల  ఇతర వర్గీకరణలు ‘నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద హాలిడే మరియు రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే’ అలాగే ‘బ్యాంకులు’ అకౌంట్స్ క్లోసింగ్ ‘ కిందకు వస్తాయి. 

Also Read: West Bengal: బెంగాల్ సీఎం మమతకు ‘డు ఆర్ డై’ మూమెంట్.. దేశ రాజకీయాల్లో భవానీపూర్ ఇప్పుడు హాట్ టాపిక్..!

Tokyo Paralympics: బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో రజతం సాధించిన సుహాస్.. 18 కి చేరిన భారత్ పతకాల సంఖ్య

Sonu Sood: ప్రమాదకరమైన స్టంట్స్ చేసిన సోనూసూద్.. కట్ చేస్తే.. అసలు విషయం తెలిస్తే షాకవుతారు..