Tokyo Paralympics: బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో రజతం సాధించిన సుహాస్.. 18 కి చేరిన భారత్ పతకాల సంఖ్య
Tokyo Paralympics 2021: టోక్యో పారా ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. తమ హవా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 17 పతకాలు సాధించిన మన భారత క్రీడాకారులు…
Tokyo Paralympics 2021: టోక్యో పారా ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. తమ హవా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 17 పతకాలు సాధించిన మన భారత క్రీడాకారులు… తాజాగా మరో పతకాన్ని భారత్ కు అందించారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో భారత్ కు మరో రజత పతకం వచ్చింది.
బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ ఎల్ 4 ఈ విభాగంలో భారత అథ్లెట్ సుహాస్.. రజత పతకాన్ని సాధించాడు. పురుషుల సింగిల్స్ లో… ఫ్రాన్స్ దేశానికి చెందిన లుకాస్ మజుర్ తో తలపడిన సుహాస్ ఓటమిపాలయ్యాడు. 62 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో 21-15 17-21 15-21 తేడాతో ఓటమిపాలయ్యాడు. దీంతో రజతంతో సరిపెట్టుకున్నాడు సుహాస్. ఈ పతకంతో భారత్ పతకాల సంఖ్య 18 కి చేరింది.
38 ఏళ్ల సుహాస్ నోయిడా జిల్లా మేజిస్ట్రేట్. ఒక చీలమండలో బలహీనత కలిగి ఉన్నాడు. పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి ఐఏఎస్ అధికారిగా కూడా గుర్తింపు పొందారు.