Bank Customers: ఆగస్టు 12 లోపు ఈ పని చేయకుంటే ఆ బ్యాంకు ఖాతాలు క్లోజ్‌

|

Aug 03, 2024 | 3:41 PM

భారతదేశంలోని అతిపెద్ద, పురాతన బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఆగస్టు 12 లోపు కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయాలని తన కస్టమర్‌లను కోరింది. శుక్రవారం కస్టమర్‌లు కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయడంలో విఫలమైతే బ్యాంక్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నిర్ణీత కాల పరిమితి వారి ఖాతాలు నిలిపివేయనుంది. మార్చి 31, 2024లోపు ఖాతాలు కేవైసీ అప్‌డేట్ చేసి ఉండాల్సిన కస్టమర్ల కోసం ఈ..

Bank Customers: ఆగస్టు 12 లోపు ఈ పని చేయకుంటే ఆ బ్యాంకు ఖాతాలు క్లోజ్‌
Bank Account
Follow us on

భారతదేశంలోని అతిపెద్ద, పురాతన బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఆగస్టు 12 లోపు కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయాలని తన కస్టమర్‌లను కోరింది. శుక్రవారం కస్టమర్‌లు కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయడంలో విఫలమైతే బ్యాంక్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నిర్ణీత కాల పరిమితి వారి ఖాతాలు నిలిపివేయనుంది. మార్చి 31, 2024లోపు ఖాతాలు కేవైసీ అప్‌డేట్ చేసి ఉండాల్సిన కస్టమర్ల కోసం ఈ అల్టిమేటం అని బ్యాంక్ తెలిపింది. దీని కింద కస్టమర్‌లు తమ శాఖకు వెళ్లి ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఇటీవలి ఫోటో వంటి సమాచారాన్ని అప్‌డేట్ చేయడం ద్వారా కేవైసీ చేయాల్సి ఉంటుంది. పాన్, ఆదాయ రుజువు, మొబైల్ నంబర్ అవసరం ఉంటుంది.

ఆగస్టు 12లోపు కేవైసీని పూర్తి చేయండి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను అనుసరించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన కస్టమర్‌లు సజావుగా పని చేయడానికి ఆగస్టు 12 లోపు కేవైసీని అప్‌డేట్ చేయాలని కోరింది. PNB One యాప్ / ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ (IBS) / రిజిస్టర్డ్ ఇ-మెయిల్ / పోస్ట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా ఏదైనా బ్రాంచ్‌ని సందర్శించడం ద్వారా ఆగస్టు 12, 2024 వరకు కేవైసీ చేయవచ్చని బ్యాంక్ తెలిపింది.

ఇవి కూడా చదవండి

బ్యాంకుకు వెళ్లకుండా కేవైసీని ఎలా అప్‌డేట్ చేయాలి?

కస్టమర్‌లు బ్యాంకుకు వెళ్లకుండానే తమ కేవైసీని డిజిటల్‌గా అప్‌డేట్ చేసుకోవచ్చు. తమ కేవైసీని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలనుకునే కస్టమర్‌లకు రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) సర్క్యులర్ ప్రకారం.. కస్టమర్ రిజిస్టర్డ్ ఇమెయిల్ ID, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఏటీఎం, డిజిటల్ ఛానెల్‌ల ద్వారా (ఉదా. కస్టమర్‌లు ఆన్‌లైన్ బ్యాంకింగ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ అప్లికేషన్‌ల ద్వారా వారి కేవైసీని అప్‌డేట్ చేసుకోవచ్చు), లేఖ ద్వారా అటువంటి సౌకర్యాన్ని అందించాలని బ్యాంకులకు సూచించింది.

ఇది కూడా చదవండి: Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసా? ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి