HDFC బ్యాంకు కస్టమర్ల బిగ్‌ అలర్ట్‌.. 16 గంటలు బ్యాంకు సేవలకు అంతరాయం.. ఎప్పుడో తెలుసా?

హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంకు తన వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఏకంగా 16 గంటల పాటు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవను ప్రకటించింది. బ్యాంకుకు సంబంధించిన సర్వర్లను అప్‌గ్రేడ్‌ చేస్తున్నందున ఈ సేవలకు అంతరాయం ఏర్పడనుందని ప్రకటించింది. మరి ఈ సేవలు ఏయే తేదీల్లో అందుబాటులో ఉండవో తెలుసా..?

HDFC బ్యాంకు కస్టమర్ల బిగ్‌ అలర్ట్‌.. 16 గంటలు బ్యాంకు సేవలకు అంతరాయం.. ఎప్పుడో తెలుసా?

Updated on: Jan 18, 2025 | 7:23 PM

భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి తన కస్టమర్లకు హెచ్చరిక జారీ చేసింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనేక సేవలు అందుబాటులో ఉండవు. బ్యాంక్ ప్రకారం, నిర్వహణ కారణంగా జనవరి 24, 25 తేదీల్లో బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని పేర్కొంది. సర్వర్ల అప్‌డేట్‌ చేస్తుండటంతో ఈ అంతరాయం ఏర్పడనుందని బ్యాంకు తెలిపింది.

ఈ కాలంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కరెంట్, సేవింగ్స్ ఖాతాలు, రూపే క్రెడిట్ కార్డ్, హెచ్‌డిఎఫ్‌సి మొబైల్ బ్యాంకింగ్ యాప్, టిపిఎపి (థర్డ్ పార్టీ యాప్)లో యుపిఐ సేవపై యుపిఐ లావాదేవీలు మూసివేయబడతాయి. వ్యాపారానికి సంబంధించి UPI లావాదేవీలు కూడా ప్రభావితమవుతాయి.  24, 25 తేదీల్లో చాట్ బ్యాంకింగ్ SMS బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్ IVR వంటివి అందుబాటులో ఉండవు.

HDFC బ్యాంక్ చాట్‌బ్యాంకింగ్, SMS బ్యాంకింగ్, ఫోన్‌బ్యాంకింగ్ IVR సేవలపై జనవరి 24వ తేదీ రాత్రి 10:00 నుండి జనవరి 25వ తేదీ ఉదయం 2:00 గంటల వరకు (మొత్తం 16 గంటలు) అంతరాయం ఏర్పడనుందని బ్యాంకు ప్రకటించింది. ఈ కాలంలో ఈ సేవలన్నీ వినియోగదారులకు అందుబాటులో ఉండవు.

HDFC బ్యాంక్ రిజిస్టర్డ్ ఇమెయిల్ చిరునామా ద్వారా కస్టమర్‌లకు ఈ అప్‌డేట్‌ను పంపింది. ఈ తేదీలు, సమయాల్లో ఇతర ఆప్షన్లను ఉపయోగించాలని బ్యాంక్ తన కస్టమర్‌లను అభ్యర్థించింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తమ సేవలను మరింత మెరుగుపరిచేందుకు సిస్టమ్స్‌ అప్‌డేట్‌ చేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఈ తేదీలను దృష్టిలో ఉంచుకుని తమ ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకోవాలని వినియోగదారులకు సూచించారు.

ఇది కూడా చదవండి: Indian Railways: రైలు ప్రయాణం చేస్తున్నారా? ఈ 3 వాట్సాప్‌ నంబర్లు ఉండాల్సిందే.. ఎందుకో తెలుసా?

మరిన్ని బిజిఎస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి