CNG: ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌.. ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ వచ్చేస్తోంది..

|

Jul 04, 2024 | 3:05 PM

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు కేవలం కార్లు, ఆటోలకే పరిమితమైన సీఎన్‌జీ ఇప్పుడు బైక్‌ వెర్షన్‌ కూడా వస్తోంది. ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ను తీసుకొస్తున్నట్లు బజాజ్‌ ఇప్పటికే ప్రకటించింది. బజాజ్‌ ఈ ప్రకటన చేసిన రోజు నుంచి అందరిలో ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు సీఎన్‌జీ బైక్స్‌ అందుబాటులోకి వస్తాయా.? అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే వారందరి ఎదురు చూపులకు...

CNG: ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌.. ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ వచ్చేస్తోంది..
Bajaj Cng Bike
Follow us on

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశన్నంటిన తరుణంలో వాహనదారులకు ఉపశమనం కల్పిస్తూ వచ్చాయి సీఎన్‌జీ వెహికిల్స్‌. పెట్రోల్‌, డీజిల్‌తో పోల్చితే తక్కువ ధర ఉండడం, పర్యావరణానికి కూడా మేలు చేస్తుండడంతో సీఎన్‌జీ వాహనాలకు భారీగా డిమాండ్ పెరిగింది. అన్ని రకాల అత్యాధునిక ఫీచర్లు ఉన్న కార్లలో కూడా సీఎన్‌జీ వెర్షన్‌ అందుబాటులోకి వచ్చాయి.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు కేవలం కార్లు, ఆటోలకే పరిమితమైన సీఎన్‌జీ ఇప్పుడు బైక్‌ వెర్షన్‌ కూడా వస్తోంది. ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ను తీసుకొస్తున్నట్లు బజాజ్‌ ఇప్పటికే ప్రకటించింది. బజాజ్‌ ఈ ప్రకటన చేసిన రోజు నుంచి అందరిలో ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు సీఎన్‌జీ బైక్స్‌ అందుబాటులోకి వస్తాయా.? అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే వారందరి ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ సీఎన్‌జీ బైక్‌కు సంబంధించి బజాజ్‌ అధికారిక ప్రకటన చేసేసింది.

జులై 5వ తేదీన సీఎన్‌జీ బైక్‌ను విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందుకు సంబంధించి టీజర్‌ టైప్‌లో ఓ చిన్న వీడియోను కూడా విడుదల చేసింది. అయితే ఈ బైక్‌ ఫీచర్లకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే కంపెనీ విడుదల చేసిన వీడియో ప్రకారం ఈ బైక్‌ రౌండ్‌ హెడ్‌ల్యాంప్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో బజాజ్‌ విడుదల చేసిన సీటీ 110 మోడల్‌ను పోలినట్లు అర్థమవుతోంది.

ఇక ఈ బైక్‌ సీఎన్‌జీతో పాటు పెట్రోల్‌కు కూడా సపోర్ట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎలాగైతే కారులో పెట్రోల్‌, డీజీల్‌ రెండింటిని ఉపయోగించుకోవచ్చో బైక్‌లో కూడా ఒక బటన్‌ ఇచ్చారు. దీంతో రెండింటిలో నచ్చిన ఫ్యూయల్‌తో బైక్‌ను నడిపించొచ్చు. కాగా ఈ బైక్‌కు బజాజ్‌ ఫ్రీడమ్‌ 125 అనే పేరు ఉండనున్నట్లు తెలుస్తోంది. 125 సీసీ ఇంజన్‌తో వచ్చే ఈ బైక్‌ ధర రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..