
యువకుల కలల బైక్ బజాజ్ పల్సర్.. మార్కెట్లో ఎన్ని రకాల బైక్లు అందుబాటులో ఉన్నా పల్సర్ కు ఉన్నా క్రేజే వేరు. బజాజ్ పల్సర్ లో ఇప్పటికే చాలా రకాల వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఎన్ సిరీస్ ఒకటి. తక్కువ ధరలో ఈ బైక్ అందుబాటులో ఉంటుంది. దీనికి కూడా మార్కెట్లో డిమాండ్ పెరుగుతుండటంతో ఎన్ సిరీస్ పల్సర్లను పెద్ద ఎత్తున కంపెనీ లాంచ్ చేస్తోంది. గత రెండేళ్లలో పలు రకాల మోడళ్లను లాంచ్ చేసింది. లేటెస్ట్ ఎడిషన్ పల్సర్ చాలా తక్కువ ధరకే లభిస్తోంది. చకన్ ఆధారిత తయారీదారు దీనిని పరిచయం చేసింది. పల్సర్ ఎన్150తో దీనిని ఆవిష్కరించింది. దీని ధర రూ. 1,17,134(ఎక్స్ షోరూం, ఢిల్లీ) ఉంటుంది.
ఈ బజాజ్ పల్సర్ ఎన్ 150 స్పోర్టీ లుక్ లో లభిస్తున్న అతి చవకైన బైక్. దీని ధర పల్సర్ పీ 150తో సమానంగా ఉంటుంద. అయితే పల్సర్ పీ150కి పల్సన్ ఎన్150 మధ్య ప్రధాన లుక్ అండ్ డిజైన్ మాత్రమే. పల్సర్ ఎన్ 160 డిజైన్ ఆధారంగానే ఈ కొత్త పల్సర్ ఎన్ 150 తయారైంది. ముందు వైపు ఎల్ఈడీ ప్రాజెక్టర్ హెడ్ ల్యాంప్ ఉంటుంది. ఎల్ఈడీ డే టైం రన్నింగ్ లైట్లు ఉంటాయి. సింగిల్ సీట్ సెటప్ ఉంటుంది. మస్క్యూలర్ లుకింగ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. కాంపాక్ట్ టెయిల్ సెక్షన్ ఉంటుంది. సింగిల్ పీస్ ట్యాబులర్ గ్రాప్ రెయిల్, బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి.
బజాజ్ పల్సర్ ఎన్ 150 బైక్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. రేసింగ్ రెడ్, ఇబోనీ బ్లాక్, మెటాలిక్ పెరల్ వైట్ రంగుల్లో దొరకుంటుంది. దీనిలో 149.6సీసీ సింగిల్ సిలెండర్ ఎయిర్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజిన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 14.5బీహెచ్పీ, 13.5ఎన్ఎం పీక్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.
ఈ బైక్ లో ఐదు గేర్లు ఉంటాయి. పల్సర్ ఎన్ 150 బైక్ లో 31ఎంఎం టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు ఉంటాయి. ట్విన్ సైడెడ్ షాక్ అబ్జర్బర్స్ ఉంటాయి. ముందు వైపు 260ఎంఎం డిస్క్ బ్రేక్.. వెనుక వైపు 130ఎంఎం డ్రమ్ బ్రేక్ ఉంటుంది. సింగిల్ చానల్ ఏబీఎస్ సిస్టమ్ ఉంటుంది.
ఈ మోటార్ సైకిల్ సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫంక్షన్తో వస్తుంది. సెమీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఎల్సీడీ డిస్ ప్లే ఉంటుది. దీనిలో స్పీడ్, ట్రిమ్, ఆర్పీఎం వంటివి కనిపిస్తాయి. ఈ బైక్ ఇప్పటికే దేశ వ్యాప్తంగా డీలర్ల వద్ద అందుబాటులో ఉంది. డెలివరీలు కూడా ప్రారంభించే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..