AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్మార్ట్ టీవీ కొనాలనుకొనే వారికి గుడ్ న్యూస్.. ఏకంగా 60శాతం వరకూ డిస్కౌంట్.. 4కే రిజల్యూషన్ టీవీలపై ‘గ్రేట్’ ఆఫర్స్..

Amazon Great Indian Festival Sale 2023: మీ ఇంట్లో టీవీ పాతదైపోయిందా? కొత్త టీవీ కొనాలనే ప్లాన్లో ఉన్నారా? ఏవైనా మంచి ఆఫర్లు వస్తే బాగుండు అని భావిస్తున్నారా? మీరు ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. పండుగ సంబరాల్లో భాగంగా అమెజాన్ కనివినీ ఎరుగని తగ్గింపు ధరలను స్మార్ట్ టీవీలపై అందిస్తోంది. అవి కూడా స్మార్ట్, ఆండ్రాయిడ్, అల్ట్రా హెచ్ డీ, 4కే టీవీలు కావడం విశేషం. అక్టోబర్ ఎనిమిదో తేదీ నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023ని నిర్వహించనుంది.

స్మార్ట్ టీవీ కొనాలనుకొనే వారికి గుడ్ న్యూస్.. ఏకంగా 60శాతం వరకూ డిస్కౌంట్.. 4కే రిజల్యూషన్ టీవీలపై ‘గ్రేట్’ ఆఫర్స్..
Samsung Crystal Vision 4k Tv
Madhu
| Edited By: Ram Naramaneni|

Updated on: Sep 30, 2023 | 6:44 PM

Share

మీ ఇంట్లో టీవీ పాతదైపోయిందా? కొత్త టీవీ కొనాలనే ప్లాన్లో ఉన్నారా? ఏవైనా మంచి ఆఫర్లు వస్తే బాగుండు అని భావిస్తున్నారా? మీరు ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. పండుగ సంబరాల్లో భాగంగా ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ కనివినీ ఎరుగని తగ్గింపు ధరలను స్మార్ట్ టీవీలపై అందిస్తోంది. అవి కూడా స్మార్ట్, ఆండ్రాయిడ్, అల్ట్రా హెచ్ డీ, 4కే టీవీలు కావడం విశేషం. అమెజాన్ లో అక్టోబర్ ఎనిమిదో తేదీ నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 ప్రారంభం కానుంది. ఈ సేల్లో అన్ని గ్యాడ్జెట్లు, గృహోపకరణాలు, వస్తువులపై భారీ తగ్గింపు ధరలు ఉంటాయని అమెజాన్ ప్రకటించింది. అయితే అన్ని అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి చేయలేదు గానీ స్మార్ట్ టీవీలపై ఆఫర్లను మాత్రం అమెజాన్ వెబ్ సైట్లో ప్రదర్శిస్తోంది. అక్కడ పెట్టిన ఓ టీజర్లో పలు దిగ్గజ బ్రాండ్ల టీవీలపై అందిస్తున్న రాయితీలు, ఆఫర్లను ప్రకటించింది. వాటిల్లో శామ్సంగ్, వన్ ప్లస్, ఎల్జీ, జియోమీ వంటి బ్రాండ్లకు చెందిన టీవీలు ఉన్నాయి. అవి కూడా 4కే అల్ట్రా హెచ్ డీ, డాల్బీ సౌండ్ సిస్టమ్ తో వస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఆ టీవీలు ఏంటి? ఆఫర్లు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఆఫర్లు ఇలా..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్లో చాలా టీవీలపై 60శాతం వరకూ డిస్కౌంట్ ఉంది. పైగా ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేస్తే మరో 10శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దీనికి అదనంగా పాత టీవీ ఎక్స్ చేంజ్ పై కొంత తగ్గింపు లభిస్తుంది. పైగా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. అమెజాన్ పే తో పాటు కొన్ని బ్యాంకుల కార్డులపై కూడా రాయితీలు వస్తాయి.

  • ప్రముఖ చైనా బ్రాండ్ రెడ్ మీ 43 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ డీ టీవీని కేవలం రూ. 20,499కే సొంతం చేసుకోవచ్చు. దీని వాస్తవ ధర రూ. 42,999గా ఉంది. పాత టీవీ ఎక్స్ చేంజ్ చేస్తే 5,500 వరకూ తగ్గుతుంది.
  • టీసీఎల్ 40 అంగుళాల ఎస్ సిరీస్ టీవీ కేవలం 16,9990కే లభిస్తోంది. దీని అసలు ధర రూ 40,990గా ఉంది.
  • వన్ ప్లస్ టీవీ 43 అంగుళాల వై1ఎస్ ప్రో టీవీ కేవలం 26,999కే లభిస్తోంది. దీని అసలు ధర రూ. 39,999గా ఉంది. ఈ టీవీని నో కాస్ట్ ఈఎంఐతో కూడా కొనుగోలు చేయొచ్చు.
  • వీయూ 55 అంగుళాల మాస్టర్ గ్లో క్యూఎల్ఈడీ టీవీని ఈ సేల్లో 62,999కి కొనుగోలు చేయొచ్చు. దీని అసలు ధర రూ. 80వేలు ఉంటుంది. కూపన్స్ వినియోగిస్తే రూ. 3000 వరకూ డిస్కౌంట్ ఉంటుంది.
  • ఎల్‌జీ 50 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ డీ టీవీ అసలు ధర రూ. 60,990గా ఉండగా.. దీనిని అమెజాన్ సేల్లో కేవలం రూ. 40,990కే కొనుగోలు చేయొచ్చు. కూపన్ సాయంత్ మరో రూ. 1000 వరకూ తగ్గింపు లభిస్తుంది.
  • ఏసర్ 50 అంగుళాల వీ సిరీస్ 4కే అల్ట్రా హెచ్ డీ క్యూఎల్ఈడీ టీవీ అసలు ధర రూ. 59,999గా ఉండగా.. అమెజాన్ సేల్లో రూ. 32,499కే లభిస్తోంది.
  • శామ్సంగ్ క్రిస్టల్ కే ఐస్మార్ట్ యూహెచ్ డీ టీవీని 32,990కే కొనుగోలు చేయొచ్చు. దీని అసలు ధర రూ. 52,900గా ఉంది. అదనంగా కూపన్ ద్వారా మరో రూ. 1000 తగ్గింపు లభిస్తుంది.
  • సోనీ బ్రేవియా 4కే అల్ట్రా హెచ్ డీ టీవీ ఎమ్మార్పీ ధర రూ. 1,39,900 ఉండగా.. అమెజాన్ సేల్లో రూ. 82,990కే లభిస్తోంది.
ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..