Bajaj Pulsar N150: బజాజ్ పల్సర్ ఎన్150 వచ్చేసింది.. ఫీచర్స్, ధర వివరాలివే..

|

Oct 04, 2023 | 4:59 AM

Bajaj Pulsar N150: స్వదేశీ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఇండియన్ ఆటో మొబైల్ మార్కెట్‌లో దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తోంది. బైక్ లవర్స్‌ను కట్టిపడేసే ఫీచర్స్‌తో ఎప్పటికప్పు కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న బజాజ్.. ఇప్పుడు మరో బైక్‌ను విడుదల చేసింది. అదే పల్సర్ ఎన్150. అవును, పల్సర్ N150 భారత మార్కెట్‌లోకి వచ్చేసింది.

Bajaj Pulsar N150: బజాజ్ పల్సర్ ఎన్150 వచ్చేసింది.. ఫీచర్స్, ధర వివరాలివే..
Pulsar
Follow us on

Bajaj Pulsar N150: స్వదేశీ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఇండియన్ ఆటో మొబైల్ మార్కెట్‌లో దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తోంది. బైక్ లవర్స్‌ను కట్టిపడేసే ఫీచర్స్‌తో ఎప్పటికప్పు కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న బజాజ్.. ఇప్పుడు మరో బైక్‌ను విడుదల చేసింది. అదే పల్సర్ ఎన్150. అవును, పల్సర్ N150 భారత మార్కెట్‌లోకి వచ్చేసింది. ఇక దాని ధర, ఫీచర్స్ ఎంతగానో అకట్టుకుంటున్నాయి. ఈ బైక్ ధర రూ. 1.17 లక్షలు(ఎక్స్‌షోరూమ్ ప్రైజ్)గా కంపెనీ ప్రకటించింది. బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ బైక్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

ఇండియాలో N150 పల్సర్ బైక్‌ను విడుదల చేసిన బజాజ్ కంపెనీ.. దీని ప్రారంభ ధర రూ. 1.17 లక్షలు(ఎక్స్‌షోరూమ్‌)గా ప్రకటించింది. అసక్తి గల కస్టమర్లు బజాజ్ షోరూమ్‌లో ముందస్తుగా బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. అలాగే, అజాజ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో కూడా బుకింగ్ చేసుకోవచ్చునని తెలిపింది.

పల్సర్ N150 మైలేజ్..

ఇవి కూడా చదవండి

బజాజ్ కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం. కొత్తగా ప్రారంభించిన పల్సర్ N150.. పల్సర్ 150కి సమానమైన ఇంధన సామర్థ్యా్న్ని కలిగి ఉంది. ఈ బైక్ 45 నుంచి 50 వరకు మైలేజీని అందిస్తుంది.

లుక్ అండ్ డిజైన్..

లుక్స్, రోడ్ అప్పియరెన్స్ విషయానికి వస్తే.. ఈ బైక్ స్పోర్టీ లుక్‌తో వస్తుంది. పల్సర్ N160 మాదిరిగానే ఆకర్షణీయంగా ఉంది. LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఆకర్షణీయమైన ఇంధన ట్యాంక్, సింగిల్ యూనిట్ సీటింగ్, ఫ్లోటింగ్ బాడీ ప్యానెల్‌, N160 మాదిరిగానే స్పోర్టీ సౌండ్‌ని రిలీజ్ చేసే ఆకర్షణీయమైన ఎగ్జాస్ట్‌ను కలిగి ఉంది.

పల్సర్ N150 ఫీచర్స్..

ఇక ఈ బైక్.. USB పోర్ట్‌తో వస్తుంది. ఇది ఇంధన ట్యాంక్‌పై ఏర్పాటు చేయడం జరిగింది. స్పీడోమీటర్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, గేర్ పొజిషనింగ్, RPM, వేగం, ఇంధన సామర్థ్యం వంటి బైక్ సంబంధిత ముఖ్యమైన సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వస్తే.. ఇది టెలిస్కోపిక్ యూనిట్‌ను కలిగి ఉంది. వెనుక భాగంలో మోనోషాక్ యూనిట్ సపోర్ట్‌ కలిగి ఉంది.

ఇంజిన్ సామర్థ్యం..

కొత్త పల్సర్ 150 బైక్.. 149.68cc, ఫోర్ స్ట్రోక్, సింగిల్-సిలిండర్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది గరిష్టంగా 14 bhp, 13.5 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌ కలిగి ఉంది.

మరిన్ని ఆటోమొబైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..