Bajaj Chetak: హైదరాబాద్‌లో చేతక్‌ ఈ- స్కూటర్ బుకింగ్‌.. ఇప్పటి వరకు 7 నగరాల్లో విడుదల..

|

Sep 22, 2021 | 10:49 AM

Bajaj Chetak: 2022 నాటికి 24 నగరాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయాలని బజాజ్ ఆటో యోచిస్తోంది. నాగ్‌పూర్‌లో

Bajaj Chetak: హైదరాబాద్‌లో చేతక్‌ ఈ- స్కూటర్ బుకింగ్‌.. ఇప్పటి వరకు 7 నగరాల్లో విడుదల..
Bajaj Chetak
Follow us on

Bajaj Chetak: 2022 నాటికి 24 నగరాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయాలని బజాజ్ ఆటో యోచిస్తోంది. నాగ్‌పూర్‌లో జూలై 16 నుంచి బుకింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే బెంగళూరు, చెన్నై, పుణే సహా ఏడు నగరాల్లో చేతక్‌ ఈ-స్కూటర్‌ ను విడుదల చేశారు. మునుపటి ICE స్కూటర్ తయారు చేసిన15 సంవత్సరాల తరువాత 2020లో చేతక్ బ్రాండ్ సంస్థ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా తిరిగి వస్తుంది. పూణేలోని చకన్ ప్లాంట్లో ఈ కొత్త స్కూటర్లు తయారవుతున్నాయి. అయితే అన్ని నగరాల్లో లభించిన మాదిరిగానే హైదరాబాద్‌లో కూడా మంచి స్పందన వస్తోందని బజాజ్‌ ఆటో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ శర్మ తెలిపారు.

హైదరాబాద్‌లోని కొన్ని డీలర్‌షిప్‌ షోరూమ్‌ల వద్ద ఈ స్కూటర్‌ని ప్రదర్శనకు ఉంచారు. రూ.2,000 చెల్లించి www.chetak.com వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చు. స్కూటర్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1,44,175. బ్యాటరీ 5 గంటల్లో పూర్తిగా చార్జింగ్‌ అవుతుంది. ఒకసారి చార్జింగ్‌తో 90 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. బ్యాటరీకి 3 ఏళ్లు లేదా 50,000 కిలోమీటర్ల వరకూ వారెంటీ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. 12,000 కిలోమీటర్ల ప్రయాణం లేదా ఒక ఏడాది తర్వాత సర్వీసింగ్‌ చేయాల్సి ఉంటుందని తెలిపింది.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.8 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. ఇది 5 హెచ్‌పి శక్తిని16.2 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. మోటారు 3 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో జత చేయబడి ఉంటుంది. ఈ స్కూటర్ 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్ సాయంతో బ్యాటరీ కేవలం ఒక గంటలో 25 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. బజాజ్ ప్రకారం చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ జీవితం 70,000 కిలోమీటర్లు లేదా 7 సంవత్సరాల వరకు ఉంటుంది.

‘అజ్ఞానం గూడు కట్టిన చోటే.. మోసం గుడ్లు పెడుతుంది’ రిపబ్లిక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది.. హిట్ గ్యారంటీ.!

West Godavari: పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో విషాదం.. ఓ కంపెనీ నిర్వాకంతో యువకుడు ఆత్మహత్య..

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో అటవిక తీర్పు.. ప్రేమ జంటపై దాష్టీకం.. కట్టేసి కొట్టి.. టైర్లను మెడలో వేసి..