Fixed Deposit: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌దారులకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు పెంచిన యాక్సిస్ బ్యాంకు.. ఎంత పెంచిందంటే..

|

Mar 09, 2022 | 3:34 PM

ప్రైవేట్ దిగ్గజ బ్యాంక్ యాక్సిస్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన వడ్డీ రేట్లు 8 మార్చి 2022 నుంచి అమలులోకి వచ్చాయి...

Fixed Deposit: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌దారులకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు పెంచిన యాక్సిస్ బ్యాంకు.. ఎంత పెంచిందంటే..
Axis Bank
Follow us on

ప్రైవేట్ దిగ్గజ బ్యాంక్ యాక్సిస్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన వడ్డీ రేట్లు 8 మార్చి 2022 నుంచి అమలులోకి వచ్చాయి. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మెచ్యూరిటీ ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు మార్చింది. ఈ మధ్యే పలు బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. హెచ్‌డీఎఫ్‌సీ కొన్ని రకాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. రూ.2 కోట్ల కన్నా తక్కువ డిపాజిట్లపై వడ్డీరేట్లను 5-10 బేసిస్‌ పాయింట్ల మేర సవరిస్తున్నట్టు తెలిపింది. ఫిబ్రవరి 14 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయని వెల్లడించింది. ఏడాది కాల పరిమితితో కూడిన డిపాజిట్లపై వడ్డీరేటును 10 బేసిస్‌ పాయింట్లు పెంచడంతో 4.9 శాతంగా ఉన్న వడ్డీ 5 శాతానికి పెరిగింది. ఇక రెండేళ్ల కాల పరిమితి ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లనూ 5 శాతానికి పెంచారు. 2-3 ఏళ్ల కాల పరిమితి డిపాజిట్ల వడ్డీరేటును 5.20 శాతంగానే ఉంచారు. 3-5 ఏళ్ల కాల వ్యవధితో కూడిన డిపాజిట్లపై వడ్డీరేటును 5 బేసిన్‌ పాయింట్లు సవరించి 5.45 శాతానికి పెంచారు. 5-10 ఏళ్ల ఎఫ్‌డీలపై వడ్డీరేటు 5.60 శాతంగా ఉంది.

ఎస్బీఐ దీర్ఘకాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లను 15 బేసిస్‌ పాయింట్ల మేర సవరించింది. పెంచిన వడ్డీరేట్లు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వచ్చాయి. 3-5 ఏళ్ల ఎఫ్‌డీలపై వడ్డీరేటును 5.30 నుంచి 5.45 శాతానికి పెంచింది. సీనియర్‌ సిటిజన్లకు 5.80 నుంచి 5.95 శాతానికి పెంచారు. ఇక 2-3 ఏళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు సవరించారు. గతంలో 5.10 శాతం వడ్డీ ఇస్తుండగా ఇప్పుడది 5.45కు పెరిగింది. సీనియర్‌ సిటిజన్లకు 5.80 నుంచి 5.95కు పెంచారు. రెండు నుంచి మూడేళ్లలోపు ఎఫ్‌డీలపై 10 బేసిస్‌ పాయింట్లు పెంచారు. గతంలో 5.10 శాతం వడ్డీ ఇస్తుండగా ఇప్పుడది 5.20 శాతానికి పెరిగింది. సీనియర్‌ సిటిజన్లకు ఇది 5.60 నుంచి 5.70కు పెరిగింది. 5 నుంచి 10 ఏళ్ల ఎఫ్‌డీల వడ్డీ రేటు 5.40 నుంచి 5.50కు పెంచారు. సీనియర్‌ సిటిజన్లకు 6.20 నుంచి 6.30 శాతానికి పెంచారు. పెంచిన వడ్డీరేట్లు రూ.2 కోట్ల కన్నా తక్కువ విలువైన ఎఫ్‌డీలకే వర్తిస్తాయి.

సవరించిన వడ్డీ రేట్లు

7 రోజుల నుంచి 14 వరకు 2.5%, 30 రోజుల నుంచి 45 వరకు 3%,  61 రోజులకు  3. 3, 6 నెలలకు 4.4%, సంవత్సరానికి 5.5%, మూడు సంవత్సారలకు 5.4%,
5 నుంచి 10 సంవత్సరాలకు  5.75 శాతానికి పెంచారు.

Read Also.. Indian Markets: భయాల నుంచి బయటపడుతున్న మార్కెట్లు.. ఫోకస్ లో ఉన్న ఆ కంపెనీల షేర్లు..